Abn logo
Mar 3 2021 @ 08:42AM

'ఆర్‌ఆర్ఆర్' ఓవర్‌సీస్‌ లొల్లి .. జక్కన్న ఏం చేస్తారో?

పాన్‌ ఇండియా మోస్ట్‌ అవెయిటెడ్‌ మూవీ 'ఆర్‌ఆర్ఆర్‌(రణం రౌద్రం రుధిరం)' ఈ ఏడాది దసరా సందర్భంగా అక్టోబర్‌ 13న విడుదలకు సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోలుగా ఈ భారీ బడ్జెట్‌ మూవీ రూపొందుతోంది. స్వాతంత్ర్యానికి ముందు 1920 నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఫిక్షనల్‌ పీరియాడిక్‌ మూవీ ఇది. ఈ చిత్రంలో తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, ఆంధ్ర ప్రాంతానికి చెందిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ నటిస్తోన్న సంగతి తెలిసిందే. వీరితోపాటు బాలీవుడ్‌ తారలు అజయ్‌ దేవగణ్‌, ఆలియా భట్‌, కోలీవుడ్‌ విలక్షణ నటుడు సముద్రఖని, హాలీవుడ్‌ తారలు ఒలివియా మోరిస్‌, రే స్టీవెన్‌ సన్, అలిసన్‌ డూడీ తదితరులు కీలక ప్రాతల్లో నటిస్తున్నారు. 

భారీ అంచనాల నడుమ రూపొందుతోన్న ఈ సినిమాకు ఏరియాల వారీగా ఫ్యాన్సీ ఆఫర్స్‌ వస్తున్నాయి. ఇప్పటి వరకు టాలీవుడ్‌లో మరే సినిమాకు జరగనంత భారీ మొత్తంలో ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరగనున్నట్లు సమాచారం. లేటెస్ట్‌ సమాచారం మేరకు ఈ సినిమా ఓవర్‌సీస్‌ హక్కుల విషయంలో మనస్పర్ధలు నెలకొన్నాయి. ఓవర్‌సీస్‌ హక్కులు దక్కించుకున్న బయ్యర్ కు, యు.ఎస్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థకు మధ్య డీలింగ్‌ సరిగా లేదనేది టాక్‌. ఈ లొల్లి లీగల్‌ సమస్యలకు దారి తీసే అవకాశం ఉందని కూడా అంటున్నాయి ట్రేడ్‌ వర్గాలు. మరి దీనిపై నిర్మాత డి.వి.వి.దానయ్య, జక్కన్న అండ్‌ టీమ్‌ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరమైన విషయం. ప్రస్తుతం ట్రిపులార్‌ క్లైమాక్స్‌ను చిత్రీకరించడంలో రాజమౌళి అండ్‌ టీమ్‌ బిజి బిజీగా ఉన్నారు. 

Advertisement
Advertisement
Advertisement