RRR: 3 గంటలైనా ఓకే..!

'ఆర్ఆర్ఆర్' మూవీ రన్ టైమ్ గురించి ఈ మధ్య సోషల్ మీడియాలో రక రకాల వార్తలు వస్తున్నాయి. మూడున్నర గంటలకు పైగానే 'ఆర్ఆర్ఆర్' మూవీ రన్ టైమ్ ఉందని ఇప్పటికే చాలా వరకు తగ్గించిన దర్శకుడు రాజమౌళి ఇక ఇంతకన్నా తగ్గించడం కష్ఠమని భావిస్తున్నట్టు ఆ వార్తల్లో రాశారు. అంతేకాదు మరీ మూడున్నరగంట రన్ టైమ్ అంటే ప్రేక్షకులు అంత ఓపిగ్గా చూస్తారా..! అనే కామెంట్స్ కూడా వచ్చాయి. అయితే, ఇది ఇద్దరు పోరాట యోధుల జీవిత కథకు ఫిక్షన్ డ్రామా జతచేసి తెరకెక్కించిన సినిమా. టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్, ఎన్.టి.ఆర్ లాంటి అగ్ర హీరోలతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియన్ రేంజ్‌లో రూపొందిన సినిమా. రాజమౌళి ఓ విజువల్ వండర్‌లా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇక రన్ టైమ్ మూడున్నరగంటలు అనే వార్తలు కరెక్ట్ కాదు. మొత్తంగా మూడు గంటల పది నిమిషాలలోపే మూవీ ఉంటుందట. కాబట్టి ఈ రన్ టైమ్ చూడటానికి ఏ ప్రేక్షకుడు ఇబ్బందిపడే ప్రసక్తే లేదని తాజాగా టాక్ వినిపిస్తోంది. ఇందుకు కారణం తాజాగా విడుదలైన 'అఖండ' సినిమా దాదాపు మూడుగంటలుందట. మలయాళ సినిమా 'మరక్కార్' కూడా మూడు గంటల వరకు ఉంది. 'అఖండ' చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులు 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని తప్పకుండా ఆదరిస్తారని ఈ సినిమా రన్ టైమ్ విషయంలో అసలు సమస్యే ఉండదని అంటున్నారు. కాబట్టి 'ఆర్ఆర్ఆర్' సినిమా మూడుగంటలున్నా ఓకే. 

Advertisement
Advertisement