ఓవర్సిస్ సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌లతో కలిసి జక్కన చెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తోంది. రికార్డు స్థాయిలో కోట్లు కొల్లగొడుతోంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో భారీ కలెక్షన్లను రాబడుతోందీ చిత్రం. యూఎస్‌లో బుధవారం ఒక్క రోజే 890 లోకేషన్లలో 3,38,502 డాలర్లను రాబట్టింది. దీంతో అమెరికాలో టోటల్ గ్రాస్ 10.75మిలియన్ డాలర్లకు చేరింది. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో కూడా ఈ సినిమా దుమ్ము లేపుతోంది. ఆస్ట్రేలియాలో ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 13.80 కలెక్ట్ చేయగా.. న్యూజిలాండ్‌లో రూ.1.53కోట్లను వసూలు చేసింది.
ఇవి కూడా చదవండి