దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో దుబాయ్‌లో ఎంతో గ్రాండ్‌గా నిర్వహించేదుకు ప్లాన్ చేస్తున్నారని ఈ మధ్య వార్తలు వచ్చాయి. అయితే, మేకర్స్ ఇప్పుడు ఆ ఆలోచనను విరమించుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా అజయ్ దేవగన్ - అలియా భట్ - ఓలివియా మోరీస్ - సముద్రఖని లాంటి వారు కీలక పాత్రలో నటిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' 2022, జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.
ఈ నేపథ్యంలో 'ఆర్.ఆర్.ఆర్' మూవీ ప్రమోషన్స్‌ను చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేశారు రాజమౌళి. ఇందులో భాగంగా దుబాయ్‌లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించాలనుకుంటే కోవిడ్ కేసుల భయంతో నిర్మాతలు ఈ ఈవెంట్‌ను క్యాన్సిల్ చేసుకున్నట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇండియాలోనే పలుచోట్ల 'ఆర్.ఆర్.ఆర్' మూవీ ప్రమోషన్స్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు కొత్త ప్లాన్స్ వేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ రానున్నట్టు సమాచారం. కాగా, ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.