Abn logo
Mar 3 2021 @ 22:50PM

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రికార్డ్స్‌: డిజిటల్‌ రైట్స్‌ ఎంతో తెలుసా?

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘రౌద్రం రణం రుధిరం' (ఆర్‌ఆర్‌ఆర్‌). భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకు తారాస్థాయికి చేరుతున్నాయి. దానికి తగ్గట్టే మేకింగ్‌ విషయంలో ఎక్కడా రాజీ పడటంలేదు  జక్కన్న. ఈ సినిమా క్లైమాక్స్ పార్ట్ ఓ రేంజ్‌లో ఉండాలని ఏకంగా హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్‌నే రంగంలోకి దింపాడు. ఈ విషయం ఆర్‌ఆర్‌ఆర్‌ డైరీస్‌ అంటూ చిత్రయూనిట్ అధికారికంగా ఓ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్ర బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరుగుతున్నట్లుగా లెక్కలు చెబుతున్నాయి.

ముఖ్యంగా ఈ చిత్ర డిజిటల్‌ రైట్స్‌ కనీవినీ ఎరుగని రీతిలో బిజినెస్‌ అయినట్లుగా తెలుస్తుంది. రూ. 200 కోట్లకు స్టార్‌ నెట్‌వర్క్‌ వారు ఈ హక్కులను సొంతం చేసుకున్నట్లుగా టాక్‌ నడుస్తుంది. 'ఆర్‌ఆర్‌ఆర్‌' అన్ని భాషలకు సంబంధించిన డిజిటల్‌ హక్కులకు భారీ పోటీ ఏర్పడగా.. చివరికి స్టార్‌ నెట్‌వర్క్‌ వారు రూ. 200 కోట్లకు ఆ హక్కులను సొంతం చేసుకున్నట్లుగా టాలీవుడ్‌ వర్గాల్లో వార్తలు నడుస్తున్నాయి. నిజంగా ఇది నిజమైతే మాత్రం ఇది రికార్డ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ హీరో, దర్శకుడి చిత్రానికి ఈ రేంజ్‌ బిజినెస్‌ జరగలేదు. అక్టోబర్‌ 13న వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతోన్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, కొమురం భీమ్‌గా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటించారు. డి.పార్వ‌తి స‌మ‌ర్ప‌ణ‌లో డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డి.వి.వి.దాన‌య్య భారీ బ‌డ్జెట్‌తో చిత్రాన్ని అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మిస్తున్నారు.


Advertisement
Advertisement
Advertisement