Chitrajyothy Logo
Advertisement
Published: Sun, 14 Aug 2022 14:15:13 IST

RRR: అజయ్ దేవగన్ పోస్టర్‌తో చరణ్, తారక్ ఫ్యాన్స్ అసహనం..?

twitter-iconwatsapp-iconfb-icon

టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన సినిమా ఆర్ఆర్ఆర్ (RRR) నేడు స్మాల్ స్క్రీన్ మీద ప్రసారం కానుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ramcharan), యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ (NTR) హీరోలుగా నటించిన ఈ సినిమా ఈ ఏడాది మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. రాజమౌళి మార్క్ మేకింగ్..చరణ్, తారక్ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ సినిమాని తారా స్థాయిలో నిలబెట్టాయి. పలు వాయిదాల తర్వాత విడుదలైనా కూడా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా సత్తా చాటింది.

అయితే, టెలివిజన్ ప్రీమియర్ పోస్టర్ మీద అల్లూరి సీతారామరాజుగా నటించిన రామ్ చరణ్ లేదా కొమురమ్ భీమ్ పాత్రలో నటించిన ఎన్.టి.ఆర్ పోస్టర్ గాని లేకుండా చిన్న పాత్ర పోషించిన అజయ్ దేవగన్ పోస్టర్ వేయడం ఏంటీ..? అని కొందరు అభిమానులు మండిపడుతున్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ అగ్ర దర్శకుడు, ఇద్దరు స్టార్ హీరోలను పక్కన పెట్టి హిందీ నటుడి పోస్టర్ వేయడంపై వారి అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, హిందీ వెర్షన్ జీ 5లో ప్రసారం కానున్న నేపథ్యంలోనే అజయ్ దేవగన్ పోస్టర్‌ను వేసి ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి దీనిపై ఇంకా ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో.  

ఇదిలా ఉంటే ఈరోజు ఆర్ఆర్ఆర్ టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్ధమయింది. స్టార్ మా లో తెలుగు వెర్షన్, జీ సినిమాలో హిందీ వెర్షన్ నేడు (ఆగస్టు 14) ప్రసారం అవబోతోంది. జక్కన్న నుంచి బాహుబలి సిరీస్ తర్వాత వచ్చిన ఈ మూవీపై ప్రపంచవ్యాప్తంగా అసాధారణమైన అంచనాలు నెలకొనగా, ఆ అంచనాలను ఆర్ఆర్ఆర్ అందుకుంది. మేకింగ్ పరంగా రాజమౌళీని, పర్ఫార్మెన్స్ పరంగా చరణ్, తారక్, ఆలియా భట్, అజయ్ దేవగన్‌లను.. అన్నీ సినీ పరిశ్రమలలోని ప్రముఖులు ప్రశంసలతో ముంచేశారు. ఇక తాజాగా ఈ సినిమాకు మరో అరుదైన గౌరవం కూడా దక్కింది. ఆర్ఆర్ఆర్ వచ్చి ఇన్ని నెలలవుతున్నా కూడా ఇంకా ఏదో ఒక విషయంలో ప్రశంసలు దక్కడం జక్కన్న గొప్పతనం. అయితే, కొందరు యాంటీ ఫ్యాన్స్ కూడా ఈ మూవీని ట్రోల్ చేసిన సందర్భాలున్నాయి. అవన్నీ ప్రశంసల వర్షంలో కొట్టుకుపోయాయి. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement