May 31 2021 @ 22:09PM

రూ. 60 కోట్లతో ముంబైలో కొత్త బంగ్లా కొన్న ‘ఆర్ఆర్ఆర్’ నటుడు

‘ఆర్ఆర్ఆర్’ నటుడు అనగానే మన టాలీవుడ్ హీరోలు అనుకుంటారేమో.. కానే కాదు. ఈ సినిమాలో ప్రముఖ పాత్ర చేస్తోన్న అజయ్ దేవగన్.. ముంబైలో రూ. 60 కోట్లతో ఓ కొత్త బంగ్లాను కొనుగోలు చేసినట్లుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి. కొన్ని రోజులుగా బాలీవుడ్ నటీనటులు కొత్త ప్రాపర్టీస్ కొన్నట్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ లిస్ట్‌లో అమితాబ్, అర్జున్ కపూర్, సోనాక్షి సిన్హా వంటి వారి పేర్లు కూడా ఉన్నాయి. తాజాగా అజయ్ దేవగన్ కూడా ఖరీదైన బంగ్లాను కొన్నట్లుగా అక్కడి మీడియా రాస్తోంది. అజయ్ దేవగన్ తాజాగా కొన్న ప్రాపర్టీ వివరాలిలా ఉన్నాయి. ఆయన కొన్న బంగ్లా 5310 చదరపు అడుగుల విస్తీర్ణంలో.. అన్ని సౌకర్యాలతో నిర్మించబడిందట. ప్రస్తుతం ఆయన కొన్న బంగ్లా.. ఇప్పుడాయన జుహులో ఉండే ఇంటికి దగ్గరలోనే అని తెలుస్తోంది. తన తల్లి పేరు మీద అజయ్ దేవగన్ ఈ ఆస్తిని కొన్నట్లుగా చెబుతున్నారు.

Bollywoodమరిన్ని...