కొనసాగుతున్న కరోనా ఉధృతి

ABN , First Publish Date - 2020-11-18T10:04:36+05:30 IST

కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఉమ్మడి రం గారెడ్డి జిల్లాలో మంగళవారం 437 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

కొనసాగుతున్న కరోనా ఉధృతి

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఉమ్మడి రం గారెడ్డి జిల్లాలో మంగళవారం 437 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రంగా రెడ్డి జిల్లాలో 170, వికారాబాద్‌ జిల్లాలో 27, మేడ్చల్‌ జిల్లాలో 240 కేసులు నమోద య్యాయి. మూడుజిల్లాల్లో కరోనా బాధితుల సంఖ్య 1,02,219కు చేరుకుంది. 


ఇబ్రహీంపట్నం, శంషాబాద్‌లో..

ఇబ్రహీంపట్నం / శంషాబాద్‌ : ఇబ్రహీంపట్నం డివిజన్‌లో మంగళవారం 11 కేంద్రాలతోపాటు రెండు మొబైల్‌ టీంల ద్వారా 210 మందికి కరోనా యాంటిజెన్‌ టెస్టులు నిర్వహించగా 10 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇబ్రహీంపట్నం 1, అబ్దుల్లాపూర్‌మెట్‌ 2, యాచారం 2, ఎలిమినేడు 2, హయత్‌నగర్‌ 2, మొబైల్‌ టీంలో ఒకరికి పాజిటివ్‌ అని తేలింది. శంషాబాద్‌ మున్సి పాలిటీలో 68 మందికి పరీక్షలు నిర్వహిం చగా ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది. 


 చేవెళ్ల డివిజన్‌లో..

చేవెళ్ల : చేవెళ్ల డివిజన్‌ పరిధిలో 256 మందికి కరోనా పరీక్షలు చేయగా 12 మందికి పాజిటివ్‌ వచ్చిందని వైద్యులు తెలి పారు. మంగళవారం శంకర్‌పల్లి మండ లంలో గతంలో ఎన్నడు లేనివిధంగా ఒక్క రోజే 10 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. అలాగే చేవెళ్ల, షాబాద్‌ మండలాల్లో ఒక్కొక్కరు చొప్పున పాజిటివ్‌ వచ్చింది. అలాగే మొయినాబాద్‌ మండలంలో ఒక్కకి కూడా పాజిటివ్‌ రాలేదని వైద్యులు తెలిపారు. 


షాద్‌నగర్‌ డివిజన్‌లో...

షాద్‌నగర్‌: షాద్‌నగర్‌ డివిజన్‌లో 247 మందికి కరోనా యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది. ఇందులో ఒకరు షాద్‌నగర్‌ పట్టణానికి చెందినవారు కాగా, ఒకరు ఫరూఖ్‌నగర్‌ మండలానికి, మరొకరు కొత్తూర్‌ మండ లానికి చెందిన వారున్నారు. 


మేడ్చల్‌లో..

మేడ్చల్‌  : మేడ్చల్‌ ప్రభుత్వాసుపత్రిలో 33 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అదేవిధంగా శ్రీరంగవరం పీహెచ్‌సీలో నలుగురికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఎవరికీ పాజిటివ్‌ రాలేదని వైద్యురాలు నళిని తెలిపారు.  

Updated Date - 2020-11-18T10:04:36+05:30 IST