ఆడిటోరియం పనులు ప్రారంభమయ్యేనా?

ABN , First Publish Date - 2020-11-12T09:06:56+05:30 IST

షాద్‌నగర్‌ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నైపుణ్యం గల కళాకారులు, రంగస్థల నటులు, టీవీ, సినీ ఆర్టిస్టులు ఎందరో ఉన్నారు.

ఆడిటోరియం పనులు ప్రారంభమయ్యేనా?

 నిధులున్నా ముందుకు సాగని నిర్మాణ పనులు

 వేదిక లేక కళా ప్రదర్శనకు నోచుకోని స్థానిక కళాకారులు


షాద్‌నగర్‌: షాద్‌నగర్‌ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నైపుణ్యం గల కళాకారులు, రంగస్థల నటులు, టీవీ, సినీ ఆర్టిస్టులు ఎందరో ఉన్నారు. అయితే వారి నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు తగిన వేదిక పట్టణంలో లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. గత్యంతరం లేని పరిస్థితిలో డబ్బులు వెచ్చించి ఫంక్షన్‌ హాళ్లను బుక్‌ చేసుకుని వాటిలో ప్రదర్శనలు ఇస్తూ వస్తున్నారు. ఈ మధ్య కాలం లో యువ కళాకారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కానీ వారికి కూడా తగిన వేదిక కరువైంది. ఈ విషయాన్ని గమనించిన షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ పట్టణంలోని ఎంపీడీవో కార్యాల యం ఆవరణలో గల పురాతన కళా క్షేత్రం స్థానంలో అధునాతన ఆడిటోరియం నిర్మాణానికి కృషిచేసి ప్రభుత్వం ద్వారా రెండేళ్ల క్రిత మే 5కోట్ల రూపాయలను మంజూరు చేయించారు.సుమారు 500 మంది ప్రేక్షకులు కూర్చోవడానికి వీలుగా హాళ్లు, మేకప్‌ రూంలు, పార్కింగ్‌ కోసం స్థలం లాంటి సదుపాయాలతో ఈ ఆడిటోరియం నిర్మాణం జరగాల్సి ఉంది. అయితే 2018 డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ రావడంతో పనులు ప్రారంభం కాలేదు. 


ఎమ్మెల్యే కృషి నిష్ఫలమేనా?

పట్టణంలో సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనకు ఒక వేదికుండా లని ఎమ్మెల్యే ఎంతో కృషిచేసి ప్రభుత్వం నుంచి రూ.5కోట్లు మంజూ రు చేయించారు. కానీ పనులు పూర్తికాక ఎక్కడ వేసిన గొంగడి అ క్కడే అన్న చందంగా పరిస్థితి ఉంది. పది నెలల కిందటి వరకు వ రుసగా పంచాయతీ, పార్లమెంట్‌, మున్సిపాలిటీ ఎన్నికలు రావడం తో ఆడిటోరియం నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు.


హైద రాబాద్‌కు 50కిలోమీటర్లు, అంతర్జాతీయ విమానాశ్రయానికి 30కి లో మీటర్ల దూరంలో ఉండి అంచెలుంచెలుగా అభివృద్ధి చెందుతు న్న షాద్‌నగర్‌లో ఆడిటోరియం లేకపోవడం శోచనీయమని పలువురు కళాభిమానులు, కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆడిటోరియం నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని కళాకారులు, కళా పోషకులు, కవులు, సాహితీవేత్తలు కోరుతున్నారు.

Updated Date - 2020-11-12T09:06:56+05:30 IST