అరచేతిలో ‘ధరణి’ పోర్టల్‌

ABN , First Publish Date - 2020-11-10T09:01:34+05:30 IST

సమీకృత భూ రికార్డుల నిర్వహణలో భాగంగా ప్రభుత్వం ‘ధరణి’ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆధునిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ విధానంతో ప్రజలకు పారదర్శక సేవలు అందుతున్నాయి.

అరచేతిలో ‘ధరణి’ పోర్టల్‌

 సెల్‌ఫోన్‌లోనే స్లాట్‌ బుకింగ్‌కు అవకాశం

 సత్వర రిజిస్ట్రేషన్‌... ఆ వెంటనే మ్యుటేషన్‌లు

 తహసీల్దార్‌ కార్యాలయాల్లోనే అందుబాటులో సేవలు 

 ఇప్పటివరకు వికారాబాద్‌ జిల్లాలో 200కు పైగా రిజిస్ట్రేషన్‌లు 


పరిగి: సమీకృత భూ రికార్డుల నిర్వహణలో భాగంగా ప్రభుత్వం ‘ధరణి’ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆధునిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ విధానంతో ప్రజలకు పారదర్శక సేవలు అందుతున్నాయి. మీసేవ, ఇంటర్నేట్‌ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సెల్‌ఫోన్‌ ద్వారా కూడా ధరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. గ్రామాల వారీగా భూముల వివరాలు ఇప్పటికే కంప్యూటరీకరించడం, తహసీల్దార్‌ కార్యాలయాల్లోనే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ చేయడం ప్రారంభమైంది. దీంతో ఈ ప్రక్రియ వికారాబాద్‌ జిల్లాలో  వేగవంతంగా జరుగుతోంది. భూముల క్రయ,విక్రయాలకు సంబంధించి ఇప్పటివరకు ముందుగా స్లాట్‌ బుకింగ్‌ చేసుకుంటే రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో వారం రోజుల తర్వాత రిజిస్ర్టేషన్‌కు అవకాశం వచ్చేది.


కొత్త రెవెన్యూ చట్టంతో ఇకపై ఒకేరోజులో భూ రికార్డుల బదలాయింపు, పట్టాదారు హక్కులు పొందే ప్రక్రియ కూడా జిల్లాలో ఇప్పటికే ప్రారంభమైంది. దీంతో రైతులకు నెలల తరబడి నిరీక్షించే బాధ తప్పింది. కొత్త చట్టం అమలు నేపథ్యంలో రాష్ట్రంలో రెండు నెలలుగా రిజిస్ర్టేషన్‌లు నిలిచిపోయిన సంగతి విధితమే. తహసీల్దార్‌-జాయింట్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలుగా నామకరణం పొందిన తహసీల్దార్‌ కార్యాలయాల్లో రెండు సేవలను ప్రారంభించారు. వారం రోజుల్లో వికారాబాద్‌ డివిజన్‌లోనే 150 రిజిస్ట్రేషన్‌లు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా రెండు వందలకుపైగా జరిగాయి. 


స్లాట్‌ బుకింగ్‌ ఇలా...

కొత్త రెవెన్యూ విధానంలో భూముల క్రయ విక్రయాలు కోసం సెల్‌ఫోన్‌తోనే స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవచ్చు. మీ-సేవ కార్యాలయాలు స్థానికంగా లేకపోవడంతో దూరాభారం తగ్గించేందుకు సరికొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇందుకోసం (ఛీజ్చిట్చుఽజీ.్ట్ఛజ్చూుఽజ్చుఽ్చ.జౌఠి.జీుఽ) లోకి వెళ్ళే యూజర్‌ ఐడీ పాస్‌వర్డ్‌ అనే అప్షన్లు కనిపిస్తాయి. యూజర్‌ ఐడీ అందరికీ సాధారణం కాగా, పాస్‌వర్డు స్థానంలో సెల్‌ఫోన్‌ నంబర్‌ టైప్‌ చేస్తే సైట్‌ తెరుచుకుంటుంది. స్లాట్‌ బుకింగ్‌ పేజిలోకి వెళ్ళి వ్యక్తిగత సమాచారాన్ని పూరిస్తే సెల్‌ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. దీని ఆధారంగా వచ్చిన కొత్త పాస్‌వర్డ్‌తో తెరిస్తే రిజిస్ట్రేషన్‌(కొనుగోలు చేసినది, దానం ఇచ్చినది), వారసత్వం(సక్సెషన్‌), భాగస్వామ్యం(పార్టీషియన్‌) ఇలా మూడు రకాల భూముల సేవలు కనిపిస్తాయి. అవసరమైన దానిపై క్లిక్‌చేసి విస్తీర్ణం, ఆధార్‌కార్డు, సర్వేనంబరు, పేర్లు, సాక్షుల పేర్లు ఇతర వివరాలు అప్‌లోడ్‌ చేయాలి.


రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లిస్తే చలాన్‌ వస్తుంది. జిల్లాలో పరిగి, వికారాబాద్‌, తాండూరు, కొడంగల్‌లలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉండగా, వీటిలో ఇప్పటి వరకు వ్యవసాయ, వ్యవసాయేతర భూముల క్రయవిక్రయాలు జరిగాయి. కొత్తగా వచ్చిన రెవెన్యూ చట్టంలో భాగంగా ధరణి పోర్టల్‌ రావడంలో తహసీల్దార్‌ కార్యాలయాల్లో కూడా రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రారంభమయ్యాయి. వ్యవసాయేతర ఆస్తుల సేవలకు మాత్రం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు పరిమితం కానున్నాయి. రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద పదుల సంఖ్యలో దస్తావేజు లేఖరులు భూముల రిజిస్ట్రేషన్‌ ద్వారా పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. అయితే కొత్త రెవెన్యూ చట్టంతో ఆన్‌లైన్‌ విధానం అందుబాటులోకి రావడంతో ఉపాధిపై వీరంతా ఆందోళన చెందుతున్నారు.


ఫోన్‌ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు


ఫోన్‌ద్వారా కూడా స్లాట్‌ బుకింగ్‌ చేసుకునే అవకాశం కల్పించాం. రిజిస్ట్రేషన్‌ అయితే వెంటనే మ్యుటేషన్‌లు చేస్తారు. తహసీల్దార్‌ కార్యాలయాల్లో ధరణిలో భాగంగా రిజిస్ర్టేషన్‌లు జరుగుతాయి. ఆఽధునిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ విఽధానంతో పారదర్శకంగా సేవలు అందించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని అమలుతోకి తెచ్చింది. మీసేవ, ఇంటర్నేట్‌ కేంద్రాలతో పాటు, సెల్‌ఫోన్‌లలో కూడా స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. సబ్‌ రిజిస్ట్రార్‌ తరహా సేవలను అందించేందుకు అధికారులకు నైపుణ్యతపై శిక్షణ కూడా పొందారు. జిల్లాలో ఈ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. మొదటి రోజు సాంకేతికపరంగా కాస్త ఇబ్బందులు వచ్చినా ఆ తర్వాత తొలగిపోయాయి. 

Updated Date - 2020-11-10T09:01:34+05:30 IST