బెంగళూరు ఇంకెప్పుడు..?

ABN , First Publish Date - 2020-09-17T08:51:43+05:30 IST

లెక్కకుమిక్కిలి స్టార్లు ఆ జట్టు సొంతం.. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లీ సారథ్యం.. మరో గొప్ప ఆటగాడు డివిల్లీర్స్‌ అదనపు బలం..

బెంగళూరు ఇంకెప్పుడు..?

లెక్కకుమిక్కిలి స్టార్లు ఆ జట్టు సొంతం.. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లీ సారథ్యం.. మరో గొప్ప ఆటగాడు డివిల్లీర్స్‌ అదనపు బలం.. పొట్టి క్రికెట్‌లో తిరుగు లేని ఆరోన్‌ ఫించ్‌తో మరింత పటిష్టం.. మోరిస్‌, స్టెయిన్‌, ఉదానతో పేస్‌ బౌలింగ్‌ దుర్భేద్యం.. చాహల్‌, జంపాతో ప్రత్యర్థులకు చుక్కలు చూపే స్పిన్‌ విభాగం.. కానీ ఏం లాభం? 12 సీజనల్లో ఒక్కసారీ ఆ జట్టుకు ఐపీఎల్‌ టైటిల్‌ దక్కని వైనం.. కానీ ఈసారి పరిస్థితి మార్చేయాలని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కంకణం కట్టుకుంది.


 బెంగళూరు జట్టు

స్వదేశీ ఆటగాళ్లు: విరాట్‌ కోహ్లీ, దేవదత్‌ పడిక్కల్‌, గుర్‌కీరత్‌ సింగ్‌, మహ్మద్‌ సిరాజ్‌, నవ్‌దీప్‌ సైనీ, పార్థివ్‌ పటేల్‌, పవన్‌ నేగి, శివమ్‌ దూబె, ఉమేశ్‌ యాదవ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, చాహల్‌, పవన్‌ దేశ్‌పాండే, షాబాజ్‌ అహ్మద్‌.

విదేశీ ఆటగాళ్లు: డివిల్లీర్స్‌, ఆరోన్‌ ఫించ్‌, మొయిన్‌ అలీ,  మోరిస్‌, స్టెయిన్‌, జోష్‌ ఫిలిప్‌, ఆడమ్‌ జంపా, ఉదాన.


ఐపీఎల్‌ ప్రదర్శన

2009, 2011,

2016  రన్నరప్‌


(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

మూడుసార్లు అందినట్టే అంది ఐపీఎల్‌ టైటిల్‌ చేజారడం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) నిలకడలేని ఆటతీరుకు నిదర్శనం. కానీ ఈసారి పరిస్థితి మార్చేయాలని భావిస్తున్న ఆ జట్టు ఐపీఎల్‌ వేలంలో చాలా తెలివిగా వ్యవహరించింది. డివిల్లీర్స్‌, మొయిన్‌ అలీ వంటి విదేశీ క్రికెటర్లను రిటైన్‌ చేసుకుంది. ఫించ్‌ను ఎంచుకుంది. నిరుడు అట్టడుగున నిలిచిన ఆర్‌సీబీ ఈసారి అగ్రస్థానమే ధ్యేయంగా తీవ్రంగా శ్రమిస్తోంది.


బలం: పటిష్టమైన జట్టే ఆర్‌సీబీ బలం. ఎనిమిదిమంది ఎడమచేతి ఆటగాళ్లు/ఆల్‌రౌండర్లు, ఆరుగురు కుడిచేతివాటం క్రికెటర్లతో జట్టు అత్యంత సమతూకంగా ఉంది. బ్యాట్స్‌మెన్‌ అంతా అటు పేస్‌ ఇటు స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కో వడంలో సాటిలేని వారే. ఇద్దరేసి లెఫ్టామ్‌ స్పిన్నర్లు, ఆఫ్‌ స్పిన్నర్లు, లెగ్‌స్పిన్న ర్లుండడం ఆర్‌సీబీ మరో ప్రత్యేకత. పేస్‌ బౌలింగ్‌ సీనియర్లు, జూనియర్ల సమ్మేళనం. నవదీప్‌ సైనీ నిప్పులు చెరిగే బంతులకు, ఉమేశ్‌ యాదవ్‌ ‘డెత్‌’ బౌలింగ్‌ తోడుగా నిలవడంతోపాటు స్టెయిన్‌, మోరిస్‌ పదునైన బౌలింగ్‌తో టాప్‌, టెయిలెండర్లకు దడపుట్టిస్తే బెంగళూరుకు తిరుగుండబోదు. తనకు కలిసొచ్చే యూఏఈ పిచ్‌లపై ఉదాన విజృంభిస్తే ఆర్‌సీబీకి టైటిల్‌ ఆశలు నెరవేరడం ఖాయం. 


బలహీనత: ఒకరిద్దరు బ్యాట్స్‌మెన్‌పై అతిగా ఆధారపడడం ఆర్‌సీబీకి చేటు చేస్తోంది. వారు విఫలమైతే మిగిలిన బ్యాట్స్‌మెన్‌ ఆదుకోలేకపోతున్నారు. ఆ పరిస్థితి మారాలి. అలాగే డెత్‌ ఓవర్ల బౌలింగ్‌ సమస్య కూడా జట్టును వేధిస్తోంది. స్టెయిన్‌, మోరిస్‌, ఉదాన మేటి బౌలర్లు అయినా నికార్సయిన డెత్‌ ఓవర్ల స్పెషలిస్టులు కారు. ఇంకా డెత్‌ ఓవర్లలో ధాటిగా ఆడేవారు లేకపోవడం మరో సమస్య. అయితే శివమ్‌ దూబె, మోరిస్‌, వాషింగ్టన్‌ సుందర్‌ ఆ  పరిస్థితి మారుసా ్తరేమో చూడాలి. 

Updated Date - 2020-09-17T08:51:43+05:30 IST