Abn logo
Sep 16 2021 @ 19:24PM

‘రాయల్‌ ఆర్చిడ్‌’ పరుగులు... .

ముంబై : పలు నగరాల్లో కొత్త హోటళ్ళను  ప్రారంభించడంతో... ‘రాయల్‌ ఆర్చిడ్‌ హోటల్’ పరుగులు తీస్తోంది. కంపెనీ షేర్‌ ఇంట్రాడేలో దాదాపు 5 శాతం లాభపడి, డే గరిష్ట స్థాయి రూ. 86.60 కు చేరింది. ప్రస్తుతం 3 శాతం పైగా లాభంతో రూ. 85.15 వద్ద షేర్‌ ట్రేడవుతోంది.ఈ రోజు  ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 3.85 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. ఇక కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌... రూ. 232 కోట్లుగా ఉంది. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. 


దేశవ్యాప్తంగా ఐదు కొత్త ప్రాపర్టీలను లాంఛ్ చేసినట్లు ఆర్చిడ్‌ హోటల్స్‌ ప్రకటించింది. ప్రముఖ ప్రాంతాలైన అమృత్‌సర్‌, సంబల్పూర్, సోమ్‌నాథ్‌, కబిని(కర్ణాటక)లో కొత్త హోటళ్ళను ప్రారంభించినట్లు కంపెనీ వెల్లడించింది. రెగెంటా ఇన్‌, రెగెంటా ప్లేస్‌, రెగెండ్రా సెంట్రల్‌, రెగెటా రీసార్ట్‌ల  బ్రాండ్ల కింద ఈ హోటళ్ళను ప్రారంభించినట్టు కంపెనీ తెలిపింది.