Abn logo
Jul 28 2021 @ 00:12AM

గోతిలో పడిన ఆవు

గోతిలో ఆవు

రక్షించిన  యువకులు, స్థానికులు 

రౌతులపూడి, జూలై 27: రౌతులపూడి వెలుగు కార్యాలయం వెనుక గల లెట్రిన్‌ గోతిలో ఆవు పడిపోయింది. నాగబాబుకు చెందిన ఆవు మేత నిమిత్తం వచ్చి లెట్రిన్‌ మూత బల్లపైకి ఎక్కగా బల్ల విరిగిపోవడంతో గోతిలో పడింది. దీంతో సూమారు రెండుగంటల సేపు అక్కడే ఉండిపోయింది. యువకులు, స్థానికులు రెండుగంటల సేపు శ్రమించి ఆవును రక్షించారు.