రౌడీషీటర్లు ప్రవర్తన మార్చుకోవాలి : సీఐ

ABN , First Publish Date - 2022-05-27T04:53:27+05:30 IST

రౌడీషీటర్లు ఎలాంటి గొడవలకు పోకుండా ప్రశాంతంగా జీవించాలని ఎవరైనా గొడవలకు, అల్లర్లకు పాల్పడితే చర్యలు తప్పవని వన్‌టౌన్‌ సీఐ నాగరాజు హెచ్చరించారు.

రౌడీషీటర్లు ప్రవర్తన మార్చుకోవాలి : సీఐ
కౌన్సెలింగ్‌ ఇస్తున్న సీఐ నాగరాజు

కడప(క్రైం), మే 26: రౌడీషీటర్లు ఎలాంటి గొడవలకు పోకుండా ప్రశాంతంగా జీవించాలని ఎవరైనా గొడవలకు, అల్లర్లకు పాల్పడితే చర్యలు తప్పవని వన్‌టౌన్‌ సీఐ నాగరాజు హెచ్చరించారు. గురువారం వన్‌టౌన్‌ పరిధిలోని రౌడీషీటర్లు, డెకాయిట్లు, సస్పెక్టర్‌ షీట్‌ ఉన్న వారికి కౌన్సెలింగ్‌  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రౌడీషీటర్లపై నిఘా ఉంటుందని వారి కదిలికలపై కూడా ఆరా తీస్తామన్నారు. ఎవరు కూడా గొడవల జోలికి వెళ్లకుం డా కుటుంబ సభ్యలతో సంతోషంగా జీవించాలని సూచించారు. 

Updated Date - 2022-05-27T04:53:27+05:30 IST