Abn logo
Nov 23 2021 @ 11:21AM

టప్పాచబుత్రాలో రౌడీషీటర్ల వీరంగం

హైదరాబాద్‌: టప్పాచబుత్రాలో రౌడీషీటర్ల వీరంగం కలకలం రేపింది. జేసీబీతో స్థానిక వైష్ణవి వైన్స్‌, స్నేహ చికెన్‌ సెంటర్ షాప్‌లను కూల్చివేశారు. వైష్ణవి వైన్స్‌లో రూ.37 లక్షల విలువైన మద్యాన్ని ధ్వంసం చేశారు. మహావీర్‌ కన్‌స్ట్రక్షన్స్‌, క్రిస్టల్‌ గార్డెన్స్‌కు చెందిన.. చంద్రమౌళి, కిరణ్‌లు దాడి చేశారని బాధితులు చెబుతున్నారు. స్థలం కాజేసేందుకే దుకాణాలను కూల్చివేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.