HYD : భాయ్‌ కా.. సెల్‌ఫోన్‌ బాగుచేసేందుకు టైమ్ తీసుకుంటావా.. ఎంత ధైర్యం నీకు..?

ABN , First Publish Date - 2021-07-27T13:34:15+05:30 IST

‘భాయ్‌ కా సెల్‌ఫోన్‌ బాగు చేసేందుకు సమయం తీసుకుంటావా...? ఎంత ధైర్యం నీకు’

HYD : భాయ్‌ కా.. సెల్‌ఫోన్‌ బాగుచేసేందుకు టైమ్ తీసుకుంటావా.. ఎంత ధైర్యం నీకు..?

  • రౌడీషీటర్ల హల్‌చల్‌
  • దుకాణదారుడిపై దాడి 
  • హత్యాయత్నం కేసు నమోదు  

హైదరాబాద్ సిటీ/మంగళ్‌హాట్‌ : ‘భాయ్‌ కా సెల్‌ఫోన్‌ బాగు చేసేందుకు సమయం తీసుకుంటావా...? ఎంత ధైర్యం నీకు’ అంటూ ఇద్దరు రౌడీషీటర్లు, మరోవ్యక్తి కలిసి ఓ దుకాణాదారుడిపై ఆదివారం అర్ధరాత్రి దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ఈ సంఘటన హబీబ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. హబీబ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో రౌడీషీట్‌ ఉన్న సమీర్‌(25) తన సెల్‌ఫోన్‌ పాడవడంతో రిపేరుకోసం మూడు రోజుల క్రితం నాంపల్లి లోని హైటెక్‌ సెల్‌ఫోన్‌ షాప్‌ యజమాని ఆసిఫ్‌కు ఇచ్చాడు. ఫోన్‌ బాగుచేసేందుకు సమయం పడుతుందని చెప్పగా సరేనన్న సమీర్‌ మూడు రోజుల తరువాత తన స్నేహితులైన రౌడీషీటర్‌ అక్బర్‌(26), మరో యువకుడు ఇమ్రాన్‌(24)లతో కలిసి ఆదివారం అర్ధరాత్రి వెళ్లాడు. షాప్‌ మూసి ఇంటికి వెళ్తున్న ఆసి్‌ఫను యూసుఫియన్‌ దర్గా సమీపంలో అడ్డగించారు.


భాయ్‌ సెల్‌ఫోన్‌ బాగుచేసేందుకు సమయం తీసుకుంటావా...? అంటూ గొడవకు దిగారు. ఫోన్‌ రిపేరుకు సమయం పడుతుందని చెప్పేందుకు ప్రయత్నించగా సమీర్‌ తనతో తెచ్చుకున్న పంచ్‌(ఇనుముతో తయారు చేసిన ఆయుధం)తో ఆసిఫ్‌ ముఖంపై దాడి చేశాడు. మిగిలిన ఇద్దరు కూడా అతన్ని కొట్టారు. తీవ్ర గాయాలపాలైన బాధితుడు వెంటనే హబీబ్‌నగర్‌ పోలీసులకు సమాచారం అందించడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రౌడీషీటర్లు సమీర్‌, అక్బర్‌, మరో యువకుడు ఇమ్రాన్‌లపై హత్యాయత్నం కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Updated Date - 2021-07-27T13:34:15+05:30 IST