ఏపీలో రౌడీ రాజ్యం

ABN , First Publish Date - 2021-10-21T04:56:48+05:30 IST

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ రౌడీయిజం రాజ్యమేలుతోందని ఎమ్మెల్సీ బీటెక్‌ రవి పేర్కొ న్నా రు. ప్రస్తుతం నడుస్తున్నది ప్రజా స్వామ్యామా లేక తాలిబన్ల రాజ్యమా అంటూ టీటీడీ మాజీ ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ వైసీపీ ప్రభుత్వంపై ధ్వజ మెత్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ఏపీలో రౌడీ రాజ్యం
సింహాద్రిపురంలో ఎమ్మెల్సీ బీటెక్‌ రవితో మాట్లాడుతున్న డీఎస్పీ నాగరాజు, సీఐలు

ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, రెడ్యం గృహనిర్భంధం

పుట్టా అరెస్టు విడుదల 

వేంపల్లెలో బైకు ర్యాలీ

నినదించిన మహిళా నాయకులు

సింహాద్రిపురం/వేంపల్లె/మైదుకూరు/ఖాజీపేట/దువ్వూరు/ కాశినాయన/పోరుమామిళ్ల/చాపాడు/ బద్వేలు/కలసపాడు/బ్రహ్మంగారిమఠం అక్టోబరు 20:

 రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ రౌడీయిజం రాజ్యమేలుతోందని ఎమ్మెల్సీ బీటెక్‌ రవి పేర్కొ న్నా రు. ప్రస్తుతం నడుస్తున్నది ప్రజా స్వామ్యామా లేక తాలిబన్ల రాజ్యమా అంటూ టీటీడీ మాజీ ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ వైసీపీ ప్రభుత్వంపై ధ్వజ మెత్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నర్సాపురంలో కడప పార్లమెంట్‌ మహిళా అధ్యక్షురాలు కర్నాటి శ్వేతారెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రాష్ట్రంలో టీడీపీ కార్యాలయాలు, నేత పట్టాభి ఇంటిపై దాడి చేసిన వైసీపీ ముష్కరులను వెంటనే అరెస్టు చే యాలని వేంపల్లె టీడీపీ నేత, రాష్ట్ర మాజీ డైరెక్టర్‌ షబ్బీర్‌ పేర్కొన్నారు. దాడిని నిరసిస్తూ వేంపల్లెలో బైకు ర్యాలీ నిర్వహించారు.

రాష్ట్రంలో టీడీపీ కార్యా లయాలు, నేతల ఇళ్లపై వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడులు చేయడాన్ని ఖండిస్తూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలు పుపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉద్యమించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎక్కడి కక్కడ నేతలను, ఆందోళనకారులను  నిలు వరించేందుకు గృహనిర్భంధం, అరెస్టులు చేయిం చింది. సింహాద్రిపురంలో ఎమ్మెల్సీ బీటెక్‌ రవిని జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు అడ్డుకుని గృహ నిర్భంధం చేశారు. అనంతరం ఎమ్మెల్సీ విలేకరుల తో మాట్లాడుతూ

పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్‌గా శాంతియుత నిరసన  చేపట్టేందుకు కూడా అవకా శం ఇవ్వకుండా సింహాద్రిపురంలో తెల్లవారు ఝా మున మూడుకే ఇంటి ముందు పోలీసులు మోహ రించడాన్ని చూస్తుంటే ప్రతి పక్ష పార్టీ నేతలకు ఈ ప్రభుత్వం ఏ మాత్రం విలువ ఇస్తుందో తెలుస్తోంద న్నారు. రాష్ట్రంలో రౌడీరాజ్యం నడుస్తోందని, శాంతిభ ద్రతలు పూర్తిగా లోపించాయని ఆరోపించారు. మా కు నిరసన చేసేందుకు అనుమతి ఇవ్వని పోలీసు లు పులివెందులలో వైసీపీ నేతల నిరసనకు అను మతి ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. కార్యక్ర మంలో టీడీపీ నేతలు రఘునాథరెడ్డి, టీడీపీ మండ ల అధ్యక్షుడు జోగిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వేంపల్లెలో టీడీపీ బైకు ర్యాలీ

 వైసీపీ నేతల దాడికి నిరసనగా వేంపల్లెలో మైనార్టీ కార్పొరేషన్‌ రాష్ట్ర మాజీ డైరెక్టర్‌ షబ్బీర్‌ ఆధ్వర్యంలో మాజీ గ్రంథాలయ చైర్మన్లు బాలస్వామిరెడ్డి, ముని రెడ్డి, రైతు విభాగ రాష్ట్రకార్యవర్గ సభ్యులు జగన్నాథ రెడ్డి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శేషారెడ్డి, పొట్టి పాటి మోహన్‌రెడ్డి, పివి రమణ బైకు ర్యాలీని నిర్వ హించారు. వేంపల్లె నాలుగురోడ్ల కూడలి నుంచి బస్టాండ్‌, మెయిన్‌ బజార్‌, అమ్మవారిశాల మీదుగా తిరిగి నాలుగురోడ్ల కూడలి చేరుకుని నిరసన తెలి పారు.

విషయం తెలుసుకున్న ఎస్‌ఐలు సుభాష్‌చం ద్రబోస్‌, తిరుపాల్‌నాయక్‌, పోలీసులు టీడీపీ నేతల ను అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తర లించారు. అనంతరం సొంత పూచీ కత్తుపై విడుద ల చేశారు. ఎల్‌బీఆర్‌ భాస్కర్‌రెడ్డి, పాపిరెడ్డి, గండి మాజీ చైర్మన్‌ వెంకట స్వామి, బీసీ నేతలు ఆర్వీ రమేష్‌, గోటూరు నాగ భూషణం, నందిమండలం మహేష్‌బాబు, భద్ర, మల్లి, రమణ పాల్గొన్నారు.

ఇది తాలిబన్ల రాజ్యమా...  

 రాష్ట్రంలో తాలిబన్ల రాజ్యం మాదిరి ఉందని  టీటీ డీ మాజీ ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాయల్‌ సర్కిల్‌లో స్థానిక నేతలతో కలసి బైఠాయించారు. సీఐలు చలపతి,కొండారెడ్డి సిబ్బందితో కలిసి అక్కడి కి చేరుకుని బంద్‌ను భగ్నం చేశారు. సుధాకర్‌ యాదవ్‌ సహా ఆందోళన కారులను పోలీసులు అరె స్టు చేసి స్టేషన్‌కు తరలించారు. దీంతో నేతలు, కార్యకర్తలు స్టేషన్‌ వద్ద కొద్ది సేపు ధర్నా చేపట్టారు.

అనంతరం పుట్టాను ప్రొద్దుటూరులోని తన ఇంటి వద్దే ఉండాలంటూ సొంత పూచికతు, కండీషన్‌ బె యిల్‌పై విడుదల చేసి ఇంటికే పరిమితం చేశారు. కాగా మాజీ ఎంపీపీ ధనపాల జగన్‌, ఇతర నేత లను పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. ఖాజీపేట మండలం దుంపలగట్టులో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డిని ఎస్‌ఐ కుళాయప్ప సిబ్బందితో కలిసి అడ్డుకున్నారు. దీంతో ఆయన సతీమణి లక్ష్మీప్రసన్న, టీడీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. మైదుకూరులో ధర్నా నిర్వహించేందుకు దువ్వూరు నుంచి వె ళుతున్న టీడీపీ నేతలు బోరెడి ్డ వెంకటరమణారెడ్డి, భాస్కర్‌రెడ్డిని ఎస్‌ఐ కేసీ రాజు గుడిపాడు సమీపంలో అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు.

కాశినాయన మండల కేంద్రం నర్సాపురంలో కర్నాటి శ్వేతారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నేతలు రోడ్డుపై బైఠాయించారు. దాడిని నిరసిస్తూ కార్యకర్తలతో కలిసి డిప్యూటీ తహసీల్దారు రవిశంకర్‌కు విన తి పత్రం అందజేశారు. ఎస్‌ఐ రామాంజనేయుడు నిరసనను అడ్డుకుని సర్పంచ్‌ ఖాజావళి, ఉపసర్పంచ్‌ నాగేంద్రారెడ్డ్డి, కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు.

టీడీ పీ నేతలు, కార్యాలయాలపై దాడి అమానుషమని కడప పార్లమెంట్‌ టీడీపీ ఉపాధ్యక్షుడు బంగారు గుర్విరెడ్డ్డి, టీడీపీ నేతలు విజయ్‌కుమార్‌రెడ్డి, ఓ.రోహిత్‌రెడ్డి, బి.నరసింహారెడ్డి, వేణుగోపాల్‌రెడ్డ్డి, వెంకటసుబ్బయ్య పేర్కాన్నారు. వైసీపీ అరాచకాలు నశించాలని పోరుమామిళ్లలో టీడీపీ పార్లమెంటరీ సహాయ కార్యదర్శి తిరుమలశెట్టి సుబ్బారావు ఆధ్వ ర్యంలో నిరసన తెలిపారు.  అంబేడ్కర్‌  సర్కిల్‌ వద్ద టీడీపీ నేతలు కొద్దిసేపు రాస్తారోకో నిర్వహించారు. ఎస్‌ఐ హరిప్రసాద్‌ రాస్తారోకోను విరమింపచేశారు. టీడీపీ నేతలు ఇమామ్‌హుస్సేన్‌, చిత్తలూరు రామసుబ్బారెడ్డి, లక్ష్మినారాయణ, సత్యరాజ్‌, ప్రొఫెసర్‌ బాష, మస్తాన్‌, మురళి పాల్గొన్నారు. టీడీపీ మండ ల పార్టీ అధ్యక్షుడు నగరిబైరవ ప్రసాద్‌ను పోలీసు లు హౌస్‌ అరెస్టు చేశారు.

వైసీపీ నేతలది గాడ్సే మార్గమని ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌ఛార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర బంద్‌ సందర్భంగా ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని పోలీసులు చాపాడు పోలీసు స్టేషన్‌కు తరలించారు. బద్వేలులో టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. టీడీపీ కార్యాలయం నుంచి నేతలు బంద్‌లో పాల్గొనేందుకు బయలుదేరుతుండగా పోలీసులు వారిని నిలువరించారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు వెంగళరెడ్డి, టీడీపీ మండలాధ్యక్షుడు బసిరెడ్డి రవికుమార్‌, పట్టణ ప్రధాన కార్యదర్శి మిత్తికాయల రమణయ్య యాదవ్‌ నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి, సర్పంచ్‌ శ్రీనవాసులు, దానం, ఐజ య్య, శ్రీకాంత్‌, లకిడి విజయ్‌, కేవి.సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

టీడీపీ కార్యాలయాలపై దాడి పిరికిచర్య అని బద్వేలు నియోజకవర్గ బాధ్యుడు డాక్టర్‌ ఓబుళాపురం రాజశేఖర్‌ పేర్కొన్నారు. బద్వేలులో బంద్‌ కు సిద్ధమవుతుండగా తనను తెల్లవారుజామునే హౌస్‌ అరెస్టు చేశారన్నారు. 30 మంది పోలీసులు, సీఐ, ఎస్‌ఐలు తనను ఇంట్లోనే నిర్భందించారన్నా రు. అధికార పార్టీ ఆగడాలు తగ్గించుకోవాలని కల సపాడు టీడీపీ మండల అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. కలసపాడులో కార్యకర్తల సమావేశంలో ఆయ న మాట్లాడుతూ

ప్రజాస్వామ్యదేశంలో ఎవరికైనా నిరసన తెలిపే హక్కు ఉంటుందన్నారు. అలాంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షపార్టీలను పాలకపక్షం ఉక్కుపాదం మోపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గౌరవాధ్యక్షుడు చెన్నూరి నాగేంద్రరావు, టీడీపీ కార్యకర్తలు భద్ర య్య, సలీమ్‌, హర్షవర్ధన్‌రెడ్డి, శ్రీనివాసులరెడ్డి, సత్యానందం, రామసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. బి.మఠంలో బంద్‌ చేపట్టిన టీడీపీ నేతలు ముడమాల పోలిరెడ్డి, గురివిరెడ్డి, నాగయ్య, గురవయ్య, నరసింహులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారితోపాటు టీడీపీ నేతలు ఆర్‌.చిన్నసుబ్బయ్య, చిన్న ఆంజనేయులు, ఖాదర్‌, సురేంద్ర, పుల్లయ్య తదితరులు ఉన్నారు.



Updated Date - 2021-10-21T04:56:48+05:30 IST