విజయవాడ కల్చరల్, జనవరి 23 (ఆంధ్రజ్యోతి) : ఆశిష్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన రౌడీబాయ్స్ చిత్ర విజయోత్సవం ఆదివారం నగరంలో జరిగింది. శైలజ థియేటర్ మాట్నీ షోను హీరో ఆశిష్, హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్‌తో పాటు దర్శకుడు శ్రీహర్ష, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హర్షితరెడ్డి ప్రేక్షకులతో కలిసి వీక్షించారు. అనంతరం వారు ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడారు. రౌడీబాయ్స్ చిత్రాన్ని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.