ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి

ABN , First Publish Date - 2022-01-25T05:27:37+05:30 IST

రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని విద్యార్థి, యువజన సంఘ నాయకులు డిమాండ్‌ చేశారు.

ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి
ఐక్యత చాటుతున్న విద్యార్థి, యువజన సంఘాల నాయకులు

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో విద్యార్థి, యవజన సంఘాల వెల్లడి

గుంటూరు(తూర్పు), జనవరి 24: రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని విద్యార్థి, యువజన సంఘ నాయకులు డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం కొత్తపేట మల్లయ్య లింగం భవనలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  పదవీ విరమణ వయస్సును పెంచడంతో రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య మరింత పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే  మెగా డీఎస్సీని ప్రకటించి నిరుద్యోగులను ఆదుకోవాలన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపించారు. ముఖ్యమంత్రి మానసపుత్రికగా చెప్పుకోనే గ్రామ, వార్డు సచివాలయల ఉద్యోగులు సైతం రోడ్లు మీదకు వస్తున్నారని విమర్శించారు. ఎయిడెడ్‌ పాఠశాలలు, కళాశాలలు తిరిగి కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని డిమండ్‌ చేశారు. సమస్యల పరిష్కారానికై ఫిబ్రవరి 10న తలపెట్టిన కలెక్టరేట్‌ ముట్టడిలో విద్యార్ధులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వివిధ సంఘాల నాయకులు షేక్‌ సుభాని, లక్ష్మణ్‌, రావిపాటి సాయికృష్ణ, బందెల నాసర్‌జీ, శివ, కృష్ణ, శ్రీనివాస్‌, మరియదాసు, చినబాబు, జ్ఞానదీప్‌, యశ్వంత, సాయి, పృధ్వీ, మనోహర్‌, మోహీన తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-25T05:27:37+05:30 IST