Advertisement
Advertisement
Abn logo
Advertisement

రోటరీ సేవలు అభినందనీయం

 ఉయ్యూరు, అక్టోబరు 26 : ఉయ్యూరు రోటరీ ఆధ్వర్యంలో అందిస్తున్న సేవలు  అభినందనీయమని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అన్నారు. రోటరీ కమ్యూ నిటీ సర్వీస్‌ ట్రస్టు నూతనంగా ఏర్పాటు చేసిన రేటీనా విభాగానికి సంబంధించిన భవనాన్ని  కేసీపీ సంస్థల ఎండీ ఇర్మ్‌గార్డ్‌ వెలగపూడితో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, పేదలకు కంటి పరీక్షలు, ఆపరేషన్లు నిర్వహిస్తూ రోటరీ కంటి ఆసుపత్రి ఎంతో మందికి ఉపయో గపడుతు దన్నారు. అత్యాధునిక పరికరాలు కలిగిన ఆసుపత్రికి రూ. 6 కోట్లతో నూతన భవ నాన్ని నిర్మించి పేదలకు మెరుగైన సేవలందించేందుకు ముందుకు రావడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో పామర్రు ఎమ్మెల్యే కైలే అనీల్‌ కుమార్‌, కమ్యూనిటీ సర్వీస్‌ ట్రస్టు చైర్మన్‌ జి. వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పాటూరు రామయ్య, ట్రస్టు సెక్రటరీ వసంతరావు, డైరెక్టర్‌ పున్నారావు, రోటరీ అధ్యక్ష, కార్యదర్శులు సయ్యద్‌ అనీస్‌, సి.హెచ్‌ నాగ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. 

Advertisement
Advertisement