పిల్లలు వ్యాధుల బారిన పడకుండా రోటా వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2022-01-20T03:59:33+05:30 IST

చిన్నారులు వ్యాధుల బారిన పడకుండా రోటా వ్యాక్సిన్‌ ఎంతో ఉపయోగపడుతుందని డీఎంహెచ్‌వో కొమురం బాలు పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారులకు వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

పిల్లలు వ్యాధుల బారిన పడకుండా రోటా వ్యాక్సిన్‌
ప్రభుత్వ ఆసుపత్రిలో రోటా వ్యాక్సిన్‌ను ప్రారంభిస్తున్న డీఎంహెచ్‌వో

మంచిర్యాల కలెక్టరేట్‌, జనవరి 19: చిన్నారులు వ్యాధుల బారిన పడకుండా రోటా వ్యాక్సిన్‌ ఎంతో ఉపయోగపడుతుందని డీఎంహెచ్‌వో కొమురం బాలు పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారులకు  వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రోటా వ్యాక్సిన్‌ చిన్నారులు అజీర్తి, విరోచనాల బారిన పడకుండా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రజారోగ్య కేంద్రాల్లో ఈ వ్యాక్సిన్‌ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందన్నారు. తల్లిదండ్రులు చిన్నారులకు ఈ టీకాను వేయించాలని సూచించారు. టీకా తీసుకుని పిల్లల ఆరోగ్యాన్ని మెరుగు పర్చుకోవాలని సూచించారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో ఫయాజ్‌ఖాన్‌, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ అల్లాడి శ్రీనివాస్‌, సివిల్‌ సర్జన్‌ ఇంద్రావతి, గుండేటి నాందేవ్‌, బుక్కా వెంకటేశ్వర్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-20T03:59:33+05:30 IST