రాస్‌ మునిరత్నం మృతి తీరనిలోటు

ABN , First Publish Date - 2021-05-07T06:53:10+05:30 IST

సామాజిక సేవారంగంలో పేరుగాంచిన రాస్‌ మునిరత్నం మృతి పట్ల వివిధ రంగాల ప్రముఖులు సంతాపం తెలిపారు.

రాస్‌ మునిరత్నం మృతి తీరనిలోటు
మునిరత్నం (ఫైల్‌ ఫొటో)

సంతాప సందేశాల్లో పలువురు ప్రముఖులు

కుటుంబసభ్యులకు చంద్రబాబు, గల్లా కుటుంబీకుల పరామర్శ


తిరుపతి రూరల్‌/రవాణా/ఆటోనగర్‌, మే 6: సామాజిక సేవారంగంలో పేరుగాంచిన రాస్‌ మునిరత్నం మృతి  పట్ల వివిధ రంగాల ప్రముఖులు సంతాపం తెలిపారు. రాస్‌ సంస్థ ద్వారా మునిరత్నం అందించిన సేవలను జిల్లావాసులే కాకుండా యావత్‌ దేశమే గుర్తించిందని టీడీపీ అధినేత చంద్రబాబు కొనియాడారు. గురువారం సాయంత్రం ఆయన మునిరత్నం కుటుంబసభ్యులకు ఫోన్‌ చేసి పరామర్శించారు. ఆయన కుటుంబానికి అన్ని విధాలా అండగా వుంటామన్నారు. మునిరత్నం మరణాన్ని నమ్మలేకపోతున్నామని, ఆయన అందరినీ విడిచివెళ్ళడం బాధాకరంగా వుందన్నారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపిన చంద్రబాబు ఆయన ఆశయ సాధనకు తమవంతు సహకారం అందిస్తామన్నారు.మాజీ మంత్రి గల్లా అరుణకుమారి,అమరరాజా గ్రూప్స్‌ ఛైర్మన్‌ గల్లా రామచంద్ర నాయుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌, అమర హాస్పిటల్స్‌ అధినేత డాక్టర్‌ రమాదేవి గౌరినేని తదితరులు మునిరత్నం కుటుంబీకులను కలసి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఆయనతో తమ కుటుంబానికున్న అనుబంధాన్ని గల్లా కుటుంబీకులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.నాలుగు దశాబ్దాల పాటు తెలుగు రాష్ట్రాలతో పాటు యావద్దేశానికి శక్తిమేరకు విలువైన సేవలం దించి, అసంఖ్యాక పురస్కారాలందుకున్న ఆయన జిల్లాకు ఎనలేని పేరుప్రఖ్యాతులు, గుర్తింపును తెచ్చారని కొనియాడారు.60సంవత్సరాలకు పైబడి పేద ప్రజల సేవలో తరించిన మునిరత్నం మరణం దిగ్ర్భాంతికి గురి చేసిందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, నగర మేయర్‌ డాక్టర్‌ శిరీష ఓ ప్రకటనలో తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతా పాన్ని తెలియజేశారు.చిత్తూరు జిల్లా పేద ప్రజానీకానికి మునిరత్నం మృతి తీరని లోటు అని రాయలసీమ అధ్యయనాల సంస్థ కన్వీనర్‌ భూమన్‌ సంతాపం వ్యక్తం చేశారు.జర్నలిస్టుగానూ, రచయితగానూ మునిరత్నం ఎంతో కృషి చేశారని కొనియాడారు.చిత్తూరు జిల్లా గొప్ప సేవా తత్పరుడిని కోల్పో యిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు చిలకం రామచంద్రా రెడ్డి,రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్‌ నాయుడు,టీడీపీ నాయకులు పులివర్తి నాని, నరసింహ యాదవ్‌, రవినాయుడు,సీపీఎం నాయకులు కందారపు మురళి, కుమార్‌రెడ్డి, సీపీఐ నాయకులు రామానాయుడు, మురళి, హరినాధరెడ్డి, ఐఎఫ్‌టీయూ నాయకు లు ఆర్‌.హరికృష్ణ, వెంకటరత్నం, జయలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ రాజశేఖర నాయుడు,కాంగ్రెస్‌ నేత నవీన్‌కుమార్‌రెడ్డి తదితరులు సంతాపం వ్యక్తం చేసి న వారిలో వున్నారు.వేలాదిమంది దివ్యాంగుల జీవితాల్లో అస్తిత్వ వెలుగులు నింపిన మునిరత్నం మృతి తీవ్ర విచారకరమని వికలాంగ మహా సంఘటన్‌ జిల్లా మాజీ కన్వీనర్‌ పేరూరు బాలసుబ్రమణ్యం ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2021-05-07T06:53:10+05:30 IST