Advertisement
Advertisement
Abn logo
Advertisement

తెలుగుతనానికి నిలువెత్తు దర్పణం రోశయ్య

 ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు 

సికింద్రాబాద్‌/అమీర్‌పేట్‌, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): తెలుగుతనానికి నిలువెత్తు దర్పణంగా రోశయ్య జీవించారని, నిండు జీవితాన్ని అర్థవంతంగా గడిపారని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు శ్లాఘించారు.  ఢిల్లీ నుంచి గురువారం మధ్యాహ్నం నగరానికి వచ్చిన ఆయన నేరుగా అమీర్‌పేట్‌లోని రోశయ్య నివాసానికి వెళ్లారు. రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రోశయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి తమ సానుభూతి తెలిపారు. రోశయ్యను తాను బాగా అభిమానించేవాడినని, తనను కూడా ఆయన బాగా అభిమానించేవారని వెంకయ్యనాయుడు చెప్పారు.


వెంకయ్యను కలిసినవారిలో  రాష్ట్ర హోం మంత్రి మహమూద్‌ అలీ, మాజీ ఎంపీ కేవీపీ.రామచంద్రరావు ఉన్నారు. కాగా, రోశయ్య మృతికి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ  తన సంతాపాన్ని తెలిపారు. ఆయన సతీమణి  శివలక్ష్మికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సోనియా  సందేశం పంపారు. 


Advertisement
Advertisement