Advertisement
Advertisement
Abn logo
Advertisement

రోశయ్య మృతి ఎవరూ తీర్చలేని లోటు


అనంతపురం టౌన, డిసెంబరు 4 : ఆర్యవైశ్యుల ముద్దుబిడ్డ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గ వర్నర్‌ కొణిజేటి రోశయ్య మృతి ఆర్యవైశ్య సామాజిక వర్గా నికి ఎవరూ తీర్చలేని లోటని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర నాయకుడు, కొత్తూరు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గోపామచ్చా నరసింహులు పేర్కొన్నారు. రోశయ్య మృతికి సంతాపంగా శనివారం సాయంత్రం కొత్తూరు వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయ కల్యాణమండపంలో ఆ యన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళి అర్పించారు. రెండు ని మిషాలు మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భం గా గోపామచ్చా నరసింహులు మాట్లాడుతూ... రోశయ్య  మృతితో ఆ ర్యవైశ్య సామాజిక వర్గం పెద్దదిక్కును కోల్పోయినట్లు భా విస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కొత్తూరు ఆర్యవైశ్య సంఘం నాయకులు పరుచూరి సూర్యప్రకాష్‌, నిర్మలాదేవి, సృజన, వెంకటకృష్ణ, సతీష్‌కుమార్‌, కృష్ణం రఘు, కిశోర్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement