Advertisement
Advertisement
Abn logo
Advertisement

రోశయ్య మృతి బాధాకరం

చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు


రోశయ్య ఈ పేరు తెలియనివారుండరు.. ఆర్థిక మంత్రిగా.. సీఎంగా.. గవర్నర్‌గా అందరికీ సుపరిచితులే.. రాజకీయాల్లో ఉన్నంత కాలం అడపాదడపా జిల్లాకు వచ్చేవారు.. స్నేహితులు.. మిత్రులను కలుసుకునే వారు. పెనుగొండ, పాలకొల్లు, భీమవరం, ఆకివీడు మండలాల్లో ఎక్కువగా పర్యటించేవారు. పెనుగొండ వాసవీమాత, భీమవరం మావుళ్లమ్మను దర్శించుకునే వారు. 2018లో చివరిగా భీమవరం వచ్చారు. శనివారం ఆయన చనిపోయారనే వార్త జిల్లా వాసులను దిగ్ర్భాంతికి గురిచేసింది. 


చిరంజీవిపై పోటీకి ఆయనే కారణం : ఉషారాణి


పాలకొల్లుఅర్బన్‌ : నేను పాలకొల్లు నుంచి చిరంజీవిపై పోటీ చేయడా నికి రోశయ్య కారణం.. వెనుక ఉండి ధైర్యమిచ్చారు..గెలిపించారు.. నియోజక వర్గ అభివృద్ధికి నిధులిచ్చారు..అని మాజీ ఎమ్మెల్యే బంగారు ఉషారాణి అన్నారు. ఆయన మరణం తీరని లోటని ఉషారాణి దంపతులు సంతాపం తెలిపారు. రోశయ్య మరణించడం విచారించతగ్గ విషయమని ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల రామానాయుడు తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో శనివారం ఉదయం రోశయ్య భౌతికకాయానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.రోశయ్య కుమారుడు శివ సుబ్బారావును పరామర్శిం చారు. రోశయ్య చేతుల మీదుగా సత్కారం అందుకోవడం మరచిపోలేని  ఘటన అని విశ్రాంత ఉపాధ్యాయుడు డాక్టర్‌ కేశిరాజు రాంప్రసాద్‌ అన్నారు. కాం గ్రెస్‌ పార్టీ కార్యాలయం, వాసవీ,ఆర్యవైశ్య సంఘం ఆధ్యర్యంలో రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేశారు.ఎమ్మెల్సీ అంగర నివాళులర్పించారు. 


పశ్చిమ అంటే ప్రేమ : ఒబిలిశెట్టి


భీమవరం : పశ్చిమ గోదావరి జిల్లా అంటే రోశయ్యకు ప్రేమని, తన ఇంటికి అనేకసార్లు వచ్చారని టీడీపీ నాయకుడు వబిలిశెట్టి కనకరాజు తెలిపారు. ఆయన మృతి తీరని లోటని పేర్కొన్నారు. భీమవరం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు మానేపల్లి సూర్యనారాయణగుప్త కూడా సంతాపం తెలిపారు. ఆయన మరణం ఆంధ్రప్రదేశ్‌కు తీరని లోటని అన్నారు. రోశయ్య మరణం తనను దిగ్ర్భాంతికి గురి చేసిందని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ అన్నారు. 1960 నుంచి కూడా తన తండ్రి నాచు వెంకట్రామయ్యతో ఎంతో సన్నిహితంగా ఉండేవారని కాంగ్రెస్‌ నాయకుడు, సినీ నిర్మాత శేషగిరిరావు పేర్కొన్నారు. 1969 నుంచి తనకు సన్నిహితుడిగా ఉండేవారన్నారు.


ఆకివీడుకు 8 సార్లు రాక..


ఆకివీడు, డిసెంబరు 4: ఆకివీడుతో కొణిజేటి రోశయ్యకు ప్రత్యేక అనుబంధం ఉందని ఆర్యవైశ్య సంఘం గౌరవాధ్యక్షుడు గొంట్లా గణపతి శనివారం తెలిపారు.పలు భవనాల ప్రారంభోత్సవాలు, శుభకార్యాలకు ఆర్థికశాఖ మంత్రిగా, గవర్నర్‌గా 8 సార్లు వచ్చినట్టు చెప్పారు. 


  ఆకివీడు, డిసెంబరు 4 : రాజకీయ పదవులకు వన్నెతెచ్చిన వ్యక్తి మాజీ సీఎం, మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య అని ఆర్యవైశ్య సంఘం గౌరవాధ్యక్షుడు, మాజీ సర్పంచ్‌ గొంట్లా గణపతి అన్నారు. ఆర్యవైశ్యులు తమ దుకాణాలు మూసివేసి నివాళులర్పించారు. పొట్టిశ్రీరాముల విగ్రహం వద్దకు చేరుకుని  సంతాపం తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మంతెన రామరాజు, నియోజవర్గ వైసీపీ ఇన్‌చార్జీ గోకరాజు రామరాజు,మాజీ ఎమ్మెల్యేలు కలవపూడి శివ, పాతపాటి సర్రాజు, ఆర్య వైశ్య సంఘం మండల–పట్టణ అధ్యక్షులు వోలేటి శ్రీను, పులవర్తి లక్ష్మణ్‌, రైస్‌ మిల్లర్‌ గొంట్లా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


పాలకోడేరు : రోశయ్య మృతికి శృంగవృక్షం గ్రామస్థులు నివాళులర్పించారు.  సర్పంచ్‌ జంగం సూరిబాబు, ఉపసర్పంచ్‌ కలిదిండి ఆనందరాజు, మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కందగట్ల రఘురాములు, వాసవీ క్లబ్‌ అధ్యక్షుడు గ్రంధి రాజా, సోము రామకృష్ణ చిత్రపటానికి పూలమాల వేశారు.  


పెనుమంట్ర : మార్టేరులో ఆర్యవైశ్య సంఘ నాయకులు రోశయ్య చిత్ర పటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు.కార్యక్రమంలో గాదె బీమన్న, నార్కెడిమిల్లి నాగేంద్ర, పసుమర్తి రాజేష్‌, గాదె సుధాకర్‌, నార్కెడ్‌మిల్లి నగేష్‌, పులవర్తి విశ్వనాథం, గాదె గోపి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 


మొగల్తూరు : పంచాయతీ కార్యాలయం వద్ద రోశయ్య చిత్ర పటానికి సర్పంచ్‌ పడవల మేరీ సత్యనారాయణ, ఉప సర్పంచ్‌ బోణం నర్సింహరావు,  కార్యదర్శి నాగేశ్వరరావు, వార్డు సభ్యులు పూలమాలలు వేసి నివాళుర్పించారు.  కల్యాణ మండపంలో సంఘాధ్యక్షుడు సంకా ముత్యరామ నాగేశ్వరరావు, మానే పల్లి చిన్నా, అనంతపల్లి ప్రకాష్‌,మల్లేశ్వరరావు నివాళులర్పించారు. 


కాళ్ళ : రోశయ్య మృతి తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీరని లోటని కాంగ్రెస్‌  ఉండి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వేగేశ్న గోపాలకృష్ణంరాజు అన్నారు. కాళ్ళకూరు లో శనివారం ఆయన మాట్లాడారు. సుమారు 18 సార్లు శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఏకైక ఆర్థిక మంత్రి అని అన్నారు.  


వీరవాసరం :  రోశయ్య మృతి పాతతరం రాజకీయ శకానికి ముగింపుగా భావించాలని వీరవాసరం మండల జనసేన అధ్యక్షుడు గుండా రామకృష్ణ అభి ప్రాయపడ్డారు.రోశయ్య మృతికి సంతాపం తెలిపారు. 


ఆచంట : అపర చాణక్యుడిగా పేరుగాంచిన కొణిజేటి రోశయ్య మృతి తీవ్ర దిగ్ర్భాంతి  కలిగించిందని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. తూర్పుపాలెం పార్టీ కార్యాలయంలో రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వే సి నివాళులర్పించారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు పోడూరి గోవర్ధన, గుంటూరి పెద్దిరాజు, ఎంపీపీ సబ్బితి సుమంగళి, వైస్‌ ఎంపీపీ ఇందుకూరి సీతారామరాజు,మామిడిశెట్టి కృష్ణవేణి నివాళులర్పించారు.  రోశయ్యను ఆచంట మండలం భీమలాపురానికి చెందిన కొత్త కనకరత్నమాల సుమారు 50 సార్లు పైగా కలిసినట్టు తెలిపారు. రోశయ్య మృతికి సంతాపంగా ఆదివారం వర్తక సంఘం ఆధ్వర్యంలో ఆచంటలో షాపులు బంద్‌ చేస్తున్నట్టు చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యదర్శి నంబూరి రాజా తెలిపారు. బంద్‌కు అందరూ సహకరించాలని కోరారు.    


నరసాపురం టౌన్‌ :  రోశయ్య మృతి తీవ్ర దిగ్భాంతికి గురి చేసింది మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు.  శివాలయం సెంటర్‌లో శనివారం ఆయన చిత్రపటానికి ఆర్యవైశ్య సంఘం నాయకులతో కలిసి నివాళులర్పించారు. ఆయన మృతి తీరని లోటు అన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌ కార్యాలయాల్లో రోశయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జి పొత్తూరి రామరాజు, కోటిపల్లి సురేష్‌, అత్మూరి వెంకట నరసయ్య, గుడివాడ సాయి,టీడీపీ నాయకులు రత్నమాల, జక్కం శ్రీమన్నా రాయణ, కొల్లు పెద్దిరాజు, కొప్పాడ రవి, మల్లాడి మూర్తి, కాంగ్రెస్‌ నాయకుడు  కానూరి బుజ్జి, బొమ్మిడి రవి, శ్రీనివాస్‌, సల్మాన్‌ తదితరులు పాల్గొన్నారు.


పెనుగొండ : రోశయ్య మృతి పట్ల డీసీసీబీ డైరెక్టర్‌ కూనపనరెడ్డి లక్ష్మయ్యనాయుడు (నానాజీ)  తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రోశయ్య మృతి తీరని లోటని పెనుగొండ ఆర్యవైశ్య  సంఘం  సభ్యులు పేర్కొన్నారు. ఆర్యవైశ్య సభ్యులు అద్దేపల్లి  రాజ్‌కుమార్‌, నాగళ్ల గుప్త, శ్రీధర్‌, గోవింద్‌ సంతాపం తెలిపారు. 

ఆకివీడులో నివాళులర్పిస్తున్న నాయకులు, ఆర్య వైశ్య సంఘ సభ్యులు


Advertisement
Advertisement