రోశయ్య మృతి తీరని లోటు.. ఆయనతో అనుబంధం మరువలేనిది..

ABN , First Publish Date - 2021-12-05T06:41:57+05:30 IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం, తమిళనాడు మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య అస్తమయంతో జిల్లాతో ఆయనకున్న జ్ఞాపకాలను పలువురు గుర్తు చేసుకున్నారు.

రోశయ్య మృతి తీరని లోటు.. ఆయనతో అనుబంధం మరువలేనిది..
రోశయ్యతో మంత్రి వేణు

రాజమహేంద్రవరం, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం, తమిళనాడు మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య అస్తమయంతో జిల్లాతో ఆయనకున్న జ్ఞాపకాలను పలువురు గుర్తు చేసుకున్నారు. రోశయ్య మృతి తీరని లోటని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, మంత్రి వేణు తదితరులు పేర్కొంటూ, ఆయనతో తమ అనుబంధాన్ని తెలియజేశారు. ప్రధానంగా ఆయన అనుచరుడు, ఏపీఐఐసీ మాజీ చైర్మన్‌ శ్రీఘా కోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రోశయ్య మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా జిల్లాకు అనేకసార్లు వచ్చారన్నారు. కోట్ల విజయభాస్కరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ముద్రగడ పద్మనా భం కాపు ఉద్యమం తీవ్రస్థాయిలో ఉందని, ముద్రగడ ఆమరణ నిరాహారదీక్ష చేయగా ప్రభుత్వంతో సంప్రదింపుల తర్వాత రోశ య్య వచ్చి దీక్ష విరమింపజేశారన్నారు. చెన్నారెడ్డి సీఎంగా ఉన్న ప్పుడు ధవళేశ్వరం బ్యారేజీకి గండిపడినప్పుడు రోశయ్య స్వయం గా ఇక్కడకు వచ్చిన పర్యవేక్షించారని తెలిపారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రతిపక్షనేతగా పాదయాత్ర చేసిన సమ యంలో కేంద్ర పార్టీతో, రాజశేఖరరెడ్డికి కొంచెం గ్యాప్‌ ఉందని,  సోనియా ఒడిషా వెళుతూ విశాఖ విమానాశ్రయంలో ఉండగా రోశయ్య అక్కడకు వెళ్లి, వైఎస్‌ పాదయాత్ర గురించి వివరించి వారి మధ్య గ్యాప్‌ తొలగేటట్టు చేశారన్నారు. సీఎంగా ఉన్న రోశయ్య ఏపీఐఐసీ చైర్మన్‌ పదవి ఇచ్చారని, తర్వాత కూడా ఆయనతో ఎంతో అనుబంధం కొనసాగిందని వివరించారు.

Updated Date - 2021-12-05T06:41:57+05:30 IST