Advertisement
Advertisement
Abn logo
Advertisement

రోశయ్య రాజకీయాల్లో చెరగని ముద్ర: వెల్లంపల్లి

రాజమండ్రి: రాష్ట్ర రాజకీయాల్లో మాజీ సీఎం రోశయ్య చెరగని ముద్ర వేశారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ కొనియాడారు. రోశయ్య సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారని, ఎవరికైనా కష్టం వచ్చిందంటే ఆయన వద్దకు వెళితే సమస్య పరిష్కారం అవుతుందనే బలమైన నమ్మకం ఉండేదన్నారు. రాజకీయాల్లో ఉన్నత విలువల కోసం రోశయ్య తపించేవారని కొనియాడారు. ఏపీఐఐసీ మాజీ చైర్మన్‌ శ్రీఘాకొళ్లపు శివరామసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రోశయ్యకు రాజమహేంద్రవరంతో విడదీయరాని అనుబంధముందని, ఎవరైనా రాజకీయాల్లో రాణించాలంటే ఆయన ఆశీస్సులు తీసుకునేవారని అన్నారు. 

Advertisement
Advertisement