డెల్టా ప్రాంతంలో జోరుగా కోడి పందాలు

ABN , First Publish Date - 2022-01-15T00:24:27+05:30 IST

డెల్టా ప్రాంతంలో జోరుగా కోడి పందాలు నిర్వహిస్తున్నారు. తెనాలి, మేమూరులో ప్రత్యేక బరువు ఏర్పాటు చేశారు.

డెల్టా ప్రాంతంలో జోరుగా కోడి పందాలు

గుంటూరు: డెల్టా ప్రాంతంలో జోరుగా కోడి పందాలు నిర్వహిస్తున్నారు. తెనాలి, మేమూరులో ప్రత్యేక బరువు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కోడి పందాలు కొనసాగుతున్నాయి. భారీగా పందేం రాయుళ్లు పాల్గొన్నారు. లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. పోలీసుల సాక్షిగా మూడ్రోజులపాటు పందెంరాయుళ్లు పేట్రేగిపోనున్నారు. పందేలతోపాటు పేకాట పోటీలు, గుండాట, రికార్డింగు డ్యాన్సుల వంటివి నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అధికార వైసీపీకి చెందిన కీలక ప్రజాప్రతినిధుల సంపూర్ణ సహకారం పండుగ మూడు రోజులు జూద క్రీడలు నిర్వహించడానికి రంగం సిద్ధమైంది. కొన్ని ప్రాంతాల్లో అధికార వైసీపీలోని ద్వితీయశ్రేణి నాయకుల మధ్య ఆధిపత్య పోరు కారణంగా శాంతి భద్రతలు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. 

Updated Date - 2022-01-15T00:24:27+05:30 IST