వత్సవాయి మండలంలో జోరుగా కోడి పందాలు

ABN , First Publish Date - 2022-01-17T00:15:17+05:30 IST

వత్సవాయి మండలంలో జోరుగా కోడి పందాలు కొనసాగుతున్నాయి. లక్ష రూపాయల పందెంలో ఇరువర్గాల మధ్య ఘర్షణకు దిగారు.

వత్సవాయి మండలంలో జోరుగా కోడి పందాలు

కృష్ణా: వత్సవాయి మండలంలో జోరుగా కోడి పందాలు కొనసాగుతున్నాయి. లక్ష రూపాయల పందెంలో ఇరువర్గాల మధ్య ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణలో చిల్లకల్లుకు చెందిన వేల్పుల విజయ్ తీవ్రంగా గాయపడ్డాడు. మక్కపేట గ్రామంలో ప్రథమ చికిత్స అనంతరం విజయవాడకు తరలించారు. పరిస్థితిని పోలీసు ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. మరోవైపు పండుగ పందేలు జోరందుకున్నాయి. కోడి పందేలు రూ.కోట్లలో జరిగాయి. బరులు భారీగా వెలిశాయి. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పందెపురాయుళ్లు కాలు దువ్వారు. ఫలితంగా పండుగ మొదటి రోజు జిల్లావ్యాప్తంగా రూ.10 కోట్ల వరకూ  కోడి పందేలు, మరో రూ.10 కోట్లు లోపల-బయట ఆటలు జరిగాయి. కృష్ణాజిల్లాతో పాటు పక్క జిల్లాల నుంచీ పందెపు రాయుళ్లు రావడంతో కోడి పందేలు కోలాహలంగా సాగాయి.

Updated Date - 2022-01-17T00:15:17+05:30 IST