Advertisement
Advertisement
Abn logo
Advertisement

మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. వధువును అలా చూసి.. వెక్కి వెక్కి ఏడ్చిన వరుడు.. అక్కడున్న వారంతా షాక్..

ఇంటర్నెట్ డెస్క్: కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు అందరూ వివాహ వేదిక వద్దకు చేరుకున్నారు. వరుడు కూడా అక్కడకు వచ్చేశాడు. మరికొద్ది క్షణాల్లో పెళ్లనగా.. వధువు‌ను చూసి, వరుడు ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడ్వటం ప్రారంభించాడు. దీంతో అక్కడున్న వారంతా షాకయ్యారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


డెమొట్రియస్ క్యాషరీస్, అలెగ్జాండ్రియా ఇద్దరు ఒకరికొకరు బాగా నచ్చారు. దీంతో ఇరు కుటుంబ సభ్యులు వారికి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే పెళ్లి తేదీని కూడా ఖరారు చేశారు. ఈ క్రమంలో అందరూ ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. దీంతో డెమొట్రియస్ క్యాషరీస్.. హ్యాండ్సమ్‌గా తయారై వివాహ వేదిక వద్దకు చేరుకున్నాడు. ఈ క్రమంలో మరికొద్ది క్షణాల్లో పెళ్లనగా.. తెలుపు రంగు గౌను ధరించి.. దేవకన్యలా తయారై.. తండ్రి చేయి పట్టుకుని అక్కడకు వస్తున్న అలెగ్జాండ్రియాను చూసి వరుడు ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యాడు. కలల రాణిని పెళ్లి దుస్తుల్లో చూసి చిన్నపిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చాడు. దీంతో అక్కడున్న వారంతా షాకయ్యారు. కాగా.. ఈ దృశ్యాలను మగ్నోలియా రోడ్‌ ఫిల్మ్‌ కంపెనీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అదికాస్తా వైరల్ అయింది. దీంతో ఇప్పటి వరకు ఈ వీడియోను 34వేల మంది వీక్షించారు. 
Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement