Jun 2 2021 @ 17:20PM

అదరగొడుతున్న జాన్వీ పాట!

తన వెనుక తల్లిదండ్రులు శ్రీదేవి, బోనీకపూర్‌ బ్రాండ్‌ ఉన్నప్పటికీ స్వశక్తితో ఎదగాలనే తాపత్రయం ఉన్న నటి జాన్వీకపూర్‌. ఎవరి మీద ఆధారపడకూడదని తల్లి శ్రీదేవి చెప్పిన మాటలను పాటిస్తూ ముందుకెళ్తుంది. అందుకే నటిగా, శ్రీదేవి కూతురిగా ప్రత్యేక గుర్తింపు పొందారు జాన్వీ. ఇప్పటి వరకూ తను నటించిన ‘దఢక్‌’, ‘ఘోస్ట్‌ స్టోరీస్‌’, ‘ఆంగ్రేజీ  మిడియమ్‌’, ‘గుంజన్‌ సక్సేనా’ చిత్రాల్లో నటనతో ఆకట్టుకుంది. మార్చిలో విడుదలైన ‘రూహీ’ చక్కని విజయం అందుకుంది. హార్దిక్‌ మెహతా దర్శకత్వం వహించిన చిత్రమిది. హారర్‌, కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో జాన్వీ నటన స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమాలోని ‘నాదియాన్‌ పార్‌’ ఫుల్‌ వీడియో సాంగ్‌ను యూట్యూబ్‌లో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట డిజిటల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. జాన్వీ డాన్స్‌ అదరగొట్టిందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం జాన్వీ ‘దోస్తానా’, గుడ్‌లక్‌ జెర్రీ’ చిత్రాల్లో నటిస్తున్నారు. 



Bollywoodమరిన్ని...