Ronaldoపై దేశాధ్యక్షుడి తిట్ల వర్షం.. ఆడియో లీక్

ABN , First Publish Date - 2021-07-16T05:54:15+05:30 IST

ఫుట్ బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డోపై ఆ దేశ అధ్యక్షుడు ఫ్లోరెంటినో పెరెజ్ తిట్లతో విరుచుకుపడిన ఓ ఆడియో..

Ronaldoపై దేశాధ్యక్షుడి తిట్ల వర్షం.. ఆడియో లీక్

రియల్ మాడ్రిడ్: ఫుట్ బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డోపై ఆ దేశ అధ్యక్షుడు ఫ్లోరెంటినో పెరెజ్ తిట్లతో విరుచుకుపడిన ఓ ఆడియో టేప్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ‘‘రొనాల్డో ఓ వెర్రివాడు. ఇడియట్‌, జబ్బు మనిషి. అందరూ అతడు సాధారణంగా ఉన్నాడు అనుకుంటారు. కానీ అతను చేయాల్సిన పనులు చేయరు. అతను ఏదో చేస్తాడని మీరు అనుకుంటారు. కానీ ఏమీ చేయడు. మెండిస్‌కు, మేనేజర్ జోస్ మౌరిన్హో ఇద్దరికీ రొనాల్డోపై నియంత్రణ లేదు. వారిద్దరికీ చాలా అహంకారం ఉంది. డబ్బులు ఎక్కువగా సంపాదించవచ్చు. మనం ఈ రోజు డబ్బులకు ప్రాధాన్యం ఇస్తున్నాం. దాంతో వారు గొప్ప వాళ్లుగా కనిపిస్తారు’’ అంటూ పెరెజ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన్నట్లు ఆ ఆడియోలో ఉంది. ఇప్పుడీ ఆడియో విపరీతంగా వైరల్ అవుతోంది.

Updated Date - 2021-07-16T05:54:15+05:30 IST