Advertisement
Advertisement
Abn logo
Advertisement

అరుదైన వ్యాధితో బాధపడుతున్న పాప కోసం రొనాల్డో చేతి బ్యాండ్ వేలం

ఇంటర్నెట్ డెస్క్: ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో విసిరేసిన ఆర్మ్ బ్యాండ్ వేలం వేయనున్నారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారిని కాపాడేందుకు ఈ బ్యాండ్ వేలం వేయనున్నట్లు ఓ స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. క్రిస్టియానో రొనాల్డో పోర్చుగల్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఫుట్‌బాల్ ప్రపచంకప్‌లో నేపథ్యంలో సెర్బియాతో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఇరు జట్లూ 2-2 గోల్స్‌తో సమానంగా ఉన్నాయి. అయితే చివరి నిముషంలో రొనాల్డో ఓ గోల్‌ వేశాడు. అయితే అంపైర్ దానిని లెక్కలోకి తీసుకోలేదు. ఈ క్రమంలోనే ఆగ్రహానికి గురైన రోనాల్డో తన చేతికున్న కెప్టెన్ ఆర్మ్ బ్యాండ్‌ను తీసి నేలపై విసిరి వెళ్లిపోయాడు. 

ఆ బ్యాండ్‌ను సేకరించిన ఓ చారిటీ సంస్థ తాజాగా వేలానికి ఉంచింది. అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారి ప్రాణం కాపాడేందుకు ఈ రిస్ట్ బ్యాండ్ వేలం వేస్తున్నామని, ఇది బ్లూ కలర్‌లో, సీ అనే అక్షరం దీనిపై ఉందని సదరు సంస్థ  వెల్లడించింది. ఈ బ్యాండ్‌ను 3 రోజుల పాటు ఆన్‌లైన్‌లో వేలానికి ఉంచనున్నట్లు తెలిపింది.

Advertisement
Advertisement