Oct 28 2021 @ 13:36PM

టాలీవుడ్ డైరెక్టర్స్‌తో 'రొమాంటిక్' టీమ్..

టాలీవుడ్ డైరెక్టర్స్‌తో 'రొమాంటిక్' టీమ్ సందడి చేసింది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'రొమాంటిక్'. యంగ్ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి, ఛార్మీ కలిసి నిర్మించారు. ఈ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దాంతో మేకర్స్ నాన్‌స్టాప్‌గా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే దర్శకులు అనిల్ రావిపూడి, మెహర్ రమేశ్, వంశీ, హేమంత్ మధుకర్ 'రొమాంటిక్' మూవీ చూసేందుకు రెడీ అయ్యారు. ఈ సందర్భంగా తీసిన ఓ పిక్‌ను ఛార్మీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరి ఈ దర్శకులు 'రొమాంటిక్' మూవీకి ఎలాంటి రివ్యూ ఇవ్వనున్నారో చూడాలి. ఇక తాజాగా ఛార్మీ షేర్ చేసిన పిక్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అనిల్ పాదూరి ఈ మూవీకి దర్శకుడు. రమ్యకృష్ణ, మకరంద్ దేశ్ పాండే కీలక పాత్రల్లో కనిపిచబోతున్నారు.