Abn logo
Mar 1 2021 @ 11:38AM

జూన్ 18న `రొమాంటిక్`!

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు పూరీ ఆకాష్ హీరోగా నటించిన రెండో సినిమా `రొమాంటిక్` విడుదల తేదీపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. ఈ చిత్రం జూన్ 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మేరకు చిత్రబృందం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. మొదటి సినిమా `మెహబూబా` ఆశించిన స్థాయిలో విజయవంతం కాకపోవడంతో ఆకాష్ రూటు మార్చాడు. ఓ రొమాంటిక్ సబ్జెక్ట్‌ను ఎంచుకున్నాడు. అనిల్ పాడూరి దర్శకత్వంలో `రొమాంటిక్` సినిమా చేశాడు. 

ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. ముంబై ముద్దుగుమ్మ కేతికా శర్మ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం విడుదల చేసిన ఓ రొమాంటిక్ పోస్టర్ యూత్‌ను ఆకట్టుకునేవిధంగా ఉంది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు కూడా మంచి అదరణ సంపాదించుకున్నాయి.  రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం సమకూరుస్తున్నాడు. పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement