సమాజంలో వైద్యుల పాత్ర గొప్పది: ఎమ్మెల్సీ

ABN , First Publish Date - 2022-08-14T05:15:08+05:30 IST

సమాజంలో వైద్యుల పాత్ర గొప్పదని ఎమ్మెల్సీ వంటేరి యాదవరెడ్డి అన్నారు.

సమాజంలో వైద్యుల పాత్ర గొప్పది: ఎమ్మెల్సీ
మెడికల్‌ క్యాంపును ప్రారంభిస్తున్న యాదవరెడ్డి

గజ్వేల్‌, ఆగస్టు 13: సమాజంలో వైద్యుల పాత్ర గొప్పదని ఎమ్మెల్సీ వంటేరి యాదవరెడ్డి అన్నారు. గజ్వేల్‌ పట్టణంలోని చాకలి ఐలమ్మ భవనంలో ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా మెడికల్‌ క్యాంపును ఏర్పాటు చేయగా, గడ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళితో కలిసి క్యాంపును ప్రారంభించి ఎమ్మెల్సీ మాట్లాడారు. ఐఎంఏ ఆధ్వర్యంలో మెడికల్‌ క్యాంపును ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. వైద్యులు సమాజానికి ఎన్నో సేవలందిస్తున్నారని అన్నారు. వారివెంట ఐఎంఏ అధ్యక్షుడు ఎలిశాల లింగం, వైద్యులు శ్రీనివాస్‌, మహేందర్‌, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ జకీయోద్దీన్‌, కౌన్సిలర్‌ చందు, విద్యారాణి, నాయకులు తదితరులు ఉన్నారు. 

Updated Date - 2022-08-14T05:15:08+05:30 IST