YSRCP MLA రోజాకు చేదు అనుభవం..

ABN , First Publish Date - 2022-02-17T07:25:52+05:30 IST

YSRCP MLA రోజాకు చేదు అనుభవం..

YSRCP MLA రోజాకు చేదు అనుభవం..

  • ఓటీఎస్‌ సెగ
  • ఎందుకు కట్టాలని నిలదీసిన మహిళ
  • ‘మీతో మీ ఎమ్మెల్యే’లో చేదు అనుభవం


నిండ్ర, ఫిబ్రవరి 16: ‘‘ఎప్పుడో కట్టుకున్న ఇల్లు.. ఇప్పుడొచ్చి పదివేలు కట్టమంటావుండారు. ఎందుకు కట్టాల...?’’ అని ఒక దళిత మహిళ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాను నిలదీశారు. ‘మీతో మీ ఎమ్మెల్యే’ కార్యక్రమంలో భాగంగా బుధవారం చిత్తూరు జిల్లా నిండ్ర మండలంలోని అగరం దళితవాడను సందర్శించినపుడు రోజాకి ఈ చేదు అనుభవం ఎదురైంది. ఓటీఎస్‌పై దళితవాడ మహిళలు తమిళంలో రోజాకు ప్రశ్నలు సంధించారు. ఆమె కూడా తమిళంలోనే వారితో మాట్లాడారు.


‘నీకు లోనుంది కదా పదివేలు కట్టేస్తే ఇంక లోన్లు కట్టే పనే ఉండదు’ అని తనను నిలదీసిన మహిళకు రోజా నచ్చజెప్పబోయారు. దానికి ఆమె లోన్లు ఎప్పుడో కట్టేశామని సమాధానం చెప్పడంతో.. అయితే మీరు కట్టనవసరంలేదు అన్నారు. కాగా.. అక్కడున్న వారితో పదివేలు కట్టేస్తే పూర్తి హక్కులు వస్తాయని, కొత్తగా లోన్‌ కూడా తీసుకోవచ్చని చెప్తున్నా వారు వినలేదు. దీంతో రోజా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Updated Date - 2022-02-17T07:25:52+05:30 IST