Abn logo
Jul 4 2020 @ 14:30PM

చిరుతో ఫైర్ బ్రాండ్..?

ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి త‌న 152వ చిత్రం ‘ఆచార్య‌’ షూటింగ్‌ను రీ స్టార్ట్ చేయ‌డానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. ఈ సినిమాను వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేసి ‘లూసిఫ‌ర్‌’ను రీమేక్ చేయాల‌నుకుంటున్నారు చిరంజవి. సుజిత్ ఈ రీమేక్‌ను సిద్ధం చేస్తున్నారు. లూసిఫ‌ర్‌లో చిరంజీవి త‌ర్వాత ఆయ‌న చెల్లెలు పాత్ర చాలా ప్ర‌ధానంగా ఉంటుంది. ఆ పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తారు?  అనేది కీల‌కంగా మారింది. ఈ పాత్ర‌లో న‌టింబోతున్నారంటూ జెనీలియా, సుహాసిని, ఖుష్బూ స‌హా ప‌లువురు పేర్లు వినిపించాయి. తాజాగా సోష‌ల్ మీడియా వార్త‌ల ప్ర‌కారం ఈ లిస్టులో మ‌రో పేరు చేరింది. అదెవ‌రో కాదు.. సినిమా రంగం నుండి రాజ‌కీయాల్లోకి వెళ్లి ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న రోజా. గ‌తంలో చిరంజీవితో ప‌లు చిత్రాల్లో జ‌త క‌ట్టిన రోజా.. ఇప్పుడు నిజంగానే లూసిఫ‌ర్‌లో చెల్లెలు పాత్ర‌లో న‌టిస్తుందా?  లేదా?  అని తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Advertisement
Advertisement
Advertisement