Abn logo
Jan 13 2021 @ 12:36PM

చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రోజా

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు భోగి మంటలు వేసుకుంటే.. చంద్రబాబు తన కడుపులో మంటలు వేసుకున్నారంటూ ఫైర్ అయ్యారు. ప్రజలకు సీఎం జగన్ మంచి చేస్తుంటే చంద్రబాబు బురద జల్లటమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. చంద్రబాబు ఆరోపణలను ప్రజలు పట్టించుకోరని రోజా అన్నారు. రైతులకు వ్యతిరేకంగా జీవోలు వచ్చాయని, వాటిని తగలబెట్టి నిరసన తెలపాలని చెప్పడం చూస్తుంటే ఎంత దిగజారిపోయారో అర్థమవుతుందన్నారు. రైతే రాజన్న విధంగా రైతు అడిగినవి, అడగనవి కూడా చేసి రైతుకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి జగన్ అని రోజా వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement
Advertisement