Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రమాదంలో రహానే వైస్ కెప్టెన్సీ.. కోహ్లీ డిప్యూటీగా రోహిత్‌శర్మ!

న్యూఢిల్లీ: పేలవ ఫామ్‌తో విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా ఆటగాడు రహానేకు మరో కష్టం వచ్చిపడింది. చూస్తుంటే అతడి వైస్ కెప్టెన్సీ ఊడిపోయేలా ఉంది. పరుగుల వేటలో వెనకబడిన రహానేను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించి అతడి స్థానంలో టీ20 కెప్టెన్ రోహిత్‌శర్మను కోహ్లీ డిప్యూటీగా నియమించాలని మేనేజ్‌మెంట్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. 


ఈ నెలలో భారత జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించాల్సి ఉంది. ఆ సిరీస్ నుంచే కోహ్లీకి రోహిత్ డిప్యూటీగా వ్యవహరిస్తాడని తెలుస్తోంది. బోర్డు ఇప్పటికే నిర్ణయం తీసుకుందని, త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం. కాగా, రహానే వరుసగా విఫలమవుతుండడంతో న్యూజిలాండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టుకు దూరం పెట్టారు. గాయం కారణంగానే అతడిని పక్కన పెట్టినట్టు చెబుతున్నప్పటికీ అసలు విషయం మాత్రం ఫామ్ కోల్పోయి తంటాలు పడుతుండడమేనని చెబుతున్నారు. 


రహానే ఆటతీరును ఒకసారి పరిశీలిస్తే గత 11 టెస్టుల్లో సగటును 19 పరుగులు మాత్రమే చేశాడు. కోహ్లీ గైర్హాజరీ కారణంగా కివీస్‌తో జరిగిన కాన్పూరు టెస్టుకు రహనేనే సారథ్యం వహించాడు. ఆ టెస్టులో రెండు ఇన్నింగ్‌లలోనూ కలిపి రహానే 39 పరుగులు మాత్రమే చేశాడు. 

Advertisement
Advertisement