Rohit Sharma: నేను తిట్టుకున్న బ్యాట్‌తోనే తొలి అర్ధశతకం చేశాడు: దినేష్ కార్తీక్

ABN , First Publish Date - 2021-06-02T02:53:38+05:30 IST

తనకు కలిసి రాదని తిట్టుకున్న బ్యాట్‌తోనే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తొలి అర్ధశతకం సాధించాడని టీమిండియా ఆటగాడు దినేష్ కార్తీక్ తెలిపాడు.

Rohit Sharma: నేను తిట్టుకున్న బ్యాట్‌తోనే తొలి అర్ధశతకం చేశాడు: దినేష్ కార్తీక్

తనకు కలిసి రాదని తిట్టుకున్న బ్యాట్‌తోనే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తొలి అర్ధశతకం సాధించాడని టీమిండియా ఆటగాడు దినేష్ కార్తీక్ తెలిపాడు. ఈ రోజు (మంగళవారం) 36వ బర్త్ డే చేసుకున్న కార్తీక్..  2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌ నాటి అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆ టోర్నీలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ అద్భుత అర్ధశతకం సాధించి జట్టుకు విజయం అందించాడు. 


ఆ మ్యాచ్ గురించి తాజాగా కార్తీక్ మాట్లాడాడు. `నా బ్యాట్‌తోనే రోహిత్ తన తొలి అంతర్జాతీయ అర్ధశతకాన్ని అందుకున్నాడు. సఫారీలతో జరిగిన మ్యాచ్‌లో నేను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి తొలి బంతికే అవుటయ్యాను. దాంతో డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చి నా బ్యాట్‌ను తిట్టుకున్నాను. ఈ బ్యాట్ నాకు కలిసిరావడం లేదని రోహిత్‌తో చెప్పాను. `ఈ బ్యాట్ బాగాలేదా? నాకు ఒకసారి ఇవ్వు` అంటూ ఆ బ్యాట్ తీసుకుని రోహిత్ బ్యాటింగ్‌కు వెళ్లాడు. ఆ బ్యాట్‌తోనే అద్భుతంగా ఆడి హాఫ్ సెంచరీ చేశాడు. ఆ ఘనత నా బ్యాట్‌ది కాదు. కచ్చితంగా బ్యాట్స్‌మెన్‌దే. కాకపోతే అలాంటివి తలచుకుంటే చాలా బాగుంటుంద`ని చెప్పాడు. 

Updated Date - 2021-06-02T02:53:38+05:30 IST