Advertisement
Advertisement
Abn logo
Advertisement

Rohit Sharma: చుట్టీ ఖతమ్.. అబ్ కామ్ షురూ!

డుర్హమ్: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ తర్వాత మూడు వారాల పాటు బయోబబుల్‌, క్రికెట్‌కు దూరంగా గడుపుతూ ఎంజాయ్ చేసిన టీమిండియా క్రికెటర్లు నిన్న డుర్హమ్‌లో కలుసుకున్నారు. తొలి ట్రైనింగ్ సెషన్ నిన్న ప్రారంభం కావడంతో భారత జట్టు సారథి విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ తదితరులు స్టేడియంలో చెమటోడుస్తూ కనిపించారు. వీరితో ఫొటోలు తీసుకునేందుకు అభిమానులు పోటీ పడ్డారు. 

ఈ సందర్భంగా తన ఫొటోలను షేర్ చేసిన రోహిత్ శర్మ ‘‘సెలవులు ముగిశాయి.. ఇక, పని మొదలు’’ (చలో భాయ్, చుట్టీ ఖతమ్.. అబ్ కామ్ షురూ) అని వాటికి క్యాప్షన్ తగిలించాడు. అభిమానులకు ఈ ఫొటోలకు కామెంట్లు చేస్తూ వైరల్ చేస్తున్నారు. అలాగే, టీమిండియా సారథి కోహ్లీ కూడా కేఎల్ రాహుల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రాత్‌లతో కూడిన ఫొటోను ఇన్‌‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. భారత జట్టు వామప్ సెషన్ ఫొటోలను బీసీసీఐ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్టు చేసింది.  

Advertisement
Advertisement