బీసీసీఐ నిర్ణయంపై రోహిత్ శర్మ ప్రశంసలు

ABN , First Publish Date - 2021-05-06T22:27:43+05:30 IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను వాయిదా వేయడంపై టీమిండియా స్టార్ క్రికెటర్, ముంబై ఇండియన్స్ సారథి రోహిత్

బీసీసీఐ నిర్ణయంపై రోహిత్ శర్మ ప్రశంసలు

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను వాయిదా వేయడంపై టీమిండియా స్టార్ క్రికెటర్, ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ స్పందించాడు. టర్నీని వాయిదా వేస్తూ మంచి నిర్ణయం తీసుకుందని బీసీసీఐని ప్రశంసించాడు. బీసీసీఐ నిర్ణయాన్ని కొనియాడుతూ ముంబై ఇండియన్స్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసిన వీడియోలో రోహిత్, బుమ్రా, ఆడం మిల్నే, జయంత్ యాదవ్, షేన్‌బాండ్, రాబిన్ సింగ్ తదితరులు మాట్లాడారు. ఇలా జరగడం దురదృష్టకరమే అయినా బీసీసీఐ మంచి నిర్ణయం తీసుకుందని రోహిత్ శర్మ ప్రశంసించాడు. అభిమానుల మద్దతుకు కృతజ్ఞతలు తెలిపిన ముంబై ఇండియన్స్ మళ్లీ మనం కలుసుకునేంత వరకు అందరూ సురక్షితంగా ఉండాలని సూచించింది. 


దేశంలో కరోనా వైరస్ కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుండడం, పలువురు ఆటగాళ్లు కొవిడ్ బారినపడడంతో ఐపీఎల్‌ను బీసీసీఐ వాయిదా వేసింది. కేకేఆర్ ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్, డీసీ ఆటగాడు అమిత్ మిశ్రా, ఎస్ఆర్‌హెచ్ ఆటగాడు వృద్ధిమాన్ సాహాలు కరోనా బారినపడడంతో టోర్నీని వాయిదా వేస్తున్నట్టు ఈ నెల 4న బీసీసీఐ ప్రకటించింది. అలాగే, సీఎస్‌కే సపోర్ట్ స్టాఫ్‌లోని మైక్ హస్సీ, లక్ష్మీపతి బాలాజీ కూడా కరోనా బారనపడ్డారు. 

Updated Date - 2021-05-06T22:27:43+05:30 IST