Advertisement
Advertisement
Abn logo
Advertisement

కోహ్లీ రికార్డును సమం చేసిన టీ20 కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ

రాంచీ: టీమిండియా టీ20 జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత బ్యాట్‌తో ఇరగదీస్తున్న రోహిత్ శర్మ నిన్న న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. 36 బంతుల్లో ఫోర్, ఐదు సిక్సర్లతో 55 పరుగులు చేశాడు. ఈ అర్ధ సెంచరీతో రోహిత్ ఖాతాలో మొత్తం 29 అర్ధ సెంచరీలు చేరాయి.


ఫలితంగా టీమిండియా టీ20 మాజీ సారథి విరాట్ కోహ్లీ తర్వాత అన్నే సెంచరీలు సాధించిన రెండో క్రికెటర్‌గా రోహిత్ రికార్డులకెక్కాడు. అయితే, రోహిత్ 29 అర్ధ సెంచరీలు సాధించడానికి 118 టీ20లు అవసరం కాగా, కోహ్లీ 91 మ్యాచుల్లోనే ఆ ఘనత సాధించడం విశేషం. కాగా, భారత్-న్యూజిలాండ్ మధ్య నామమాత్రమైన చివరి టీ20 రేపు కోల్‌కతాలో జరగనుంది. 

Advertisement
Advertisement