ఇది మన బాధ్యత.. కరోనాపై పోరుకు రోహిత్ శర్మ విరాళం

ABN , First Publish Date - 2020-03-31T20:22:49+05:30 IST

దేశ వ్యాప్తంగా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ తన

ఇది మన బాధ్యత.. కరోనాపై పోరుకు రోహిత్ శర్మ విరాళం

ముంబై: దేశ వ్యాప్తంగా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ తన వొంతు సహాయాన్ని అందించాడు. కరోనాపై పోరుకు రూ.80 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు రోహిత్ ప్రకటించాడు. ప్రధాన మంత్రి సహాయ నిధి(పీఎం-కేర్స్)కు రూ.45లక్షలు, రూ.25లక్షలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇస్తున్నట్లు రోహిత్ పేర్కొన్నాడు. అంతేకాక.. లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదురుకుంటున్న వారిని ఆదుకొనేందుకు రూ.5 లక్షలు, వీధికుక్కల రక్షణకు రూ.5లక్షలు విరాళంగా ప్రకటించాడు. 


‘‘దేశం మళ్లీ దృఢంగా తన పాదాలపై తాను నిలబడేలా చేసే బాధ్యత మనందరిపై ఉంది. నా వొంతు సహాయంగా పీఎం-కేర్స్ ఫండ్‌కు రూ.45లక్షలు, రూ.25లక్షలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి, రూ.5లక్షలు ఫీడింగ్ ఇండియా సంస్థకు, రూ.5లక్షులు వీధికుక్కల రక్షణకు విరాళంగా ఇస్తున్నాను. మన నాయకులు ప్రధాని మోదీ, మహారాష్ట్ర సీఎంలకు అండగా నిలుద్దాం’’అంటూ రోహిత్ ట్వీట్ చేశాడు. 


ఇప్పుటికే ఈ పోరాటంలో ప్రభుత్వానికి సహాయంగా టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా, అజింక్యా రహానేలు తమ వొంతు అర్థిక సహాయాన్ని అందించారు. తాజాగా రోహిత్ వీరి సరసన చేరాడు. మన దేశంలో కరోనా ప్రభావం తీవ్రంగా పడిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ప్రధానంగా ఉంది. మంగళవారం ఉదయానికి రాష్ట్రంలో మొత్తం 225 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,251 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, అందులో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. 

Updated Date - 2020-03-31T20:22:49+05:30 IST