Advertisement
Advertisement
Abn logo
Advertisement

కోహ్లీ రికార్డును బద్దలుగొట్టిన రోహిత్‌శర్మ

కోల్‌కతా: కివీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భీకర ఫామ్‌లో ఉన్న టీమిండియా సారథి రోహిత్ శర్మ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అర్ధ సెంచరీ బాదిన రోహిత్.. టీ20ల్లో అత్యధికసార్లు 50 అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో టీమిండియా టీ20 మాజీ సారథి కోహ్లీ రికార్డును అధిగమించాడు. 


రోహిత్ మొత్తం 30 సార్లు 50, అంతకుమించి పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలు కూడా ఉన్నాయి. 29 అర్ధ సెంచరీలతో కోహ్లీ ఆ తర్వాతి స్థానంలో ఉన్నాడు. పాక్ ఆటగాడు బాబర్ ఆజమ్ 25 (ఒక సంచరీ), ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 22 (ఒక సెంచరీ)తో వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో మొత్తంగా 31 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 56 పరుగులు చేసి సోధీ బౌలింగులో అవుటయ్యాడు.

Advertisement
Advertisement