రోహిత్‌ ఫిట్‌నెస్‌పై స్పష్టత కావాలి

ABN , First Publish Date - 2020-10-28T09:13:32+05:30 IST

ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తొడ కండరాల గాయంతో ఐపీఎల్‌లో గత రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దీంతో గాయానికి గురైన

రోహిత్‌ ఫిట్‌నెస్‌పై స్పష్టత కావాలి

తెలుసుకునే హక్కు అభిమానికి ఉందన్న సన్నీ

దుబాయ్‌: ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తొడ కండరాల గాయంతో ఐపీఎల్‌లో గత రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దీంతో గాయానికి గురైన రోహిత్‌ను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయలేదని బీసీసీఐ ప్రకటించింది. అయితే, ఆసీస్‌ టూర్‌కు జట్లను ప్రకటించిన కొద్ది సేపటికే రోహిత్‌ ప్యాడ్లు కట్టుకొని నెట్స్‌లో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న వీడియో, ఫొటోలను ముంబై ఇండియన్స్‌  ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో రోహిత్‌ గాయం తీవ్రతపై సందేహాలు తలెత్తాయి. ఇదే విషయాన్ని టీమిండియా మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ ప్రశ్నించాడు. ‘గాయం తీవ్రమైనదే అయితే, రోహిత్‌ అసలు ప్యాడ్లే ధరించకూడదు. ఆసీ్‌సలో తొలి టెస్టు డిసెంబరు 17న మొదలవుతుంది. అంటే, అప్పటిదాకా కనీసం నెలన్నర సమయం ఉంది. ఇప్పుడు మనకు పారదర్శకత అవసరం. రోహిత్‌ గాయానికి సంబంధించి అసలు సమస్య ఏంటో చెప్పాల్సిన బాధ్యత ఉంది. అతని ఫిట్‌నెస్‌ విషయంపై తెలుసుకునే హక్కు టీమిండియా అభిమానికి ఉంది’ అని గవాస్కర్‌ వ్యాఖ్యానించాడు.    

Updated Date - 2020-10-28T09:13:32+05:30 IST