ఇంగ్లండ్‌తో సిరీస్.. అరుదైన రికార్డులపై కన్నేసిన కోహ్లీ-రోహిత్ ద్వయం

ABN , First Publish Date - 2022-06-22T01:24:27+05:30 IST

ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న భారత జట్టు జులై 1న రీషెడ్యూల్డ్ టెస్టు ఆడుతుంది. ఆ తర్వాత మూడు టీ20లు, మూడు వన్డేల్లో

ఇంగ్లండ్‌తో సిరీస్.. అరుదైన రికార్డులపై కన్నేసిన కోహ్లీ-రోహిత్ ద్వయం

లీసెస్టర్‌షైర్: ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న భారత జట్టు జులై 1న రీషెడ్యూల్డ్ టెస్టు ఆడుతుంది. ఆ తర్వాత మూడు టీ20లు, మూడు వన్డేల్లో పోటీపడుతుంది. ఈ సిరీస్‌లో పలు రికార్డులు సృష్టించేందుకు కోహ్లీ-రోహిత్ జోడీ సిద్ధమైంది. వన్డేల్లో వీరిద్దరూ కలిసి 56.04 సగటుతో 4,906 పరుగులు సాధించారు. ఫలితంగా టీమిండియా చరిత్రలోనే అత్యధిక సగటుతో 4 వేలకు పైగా పరుగులు సాధించిన జోడీగా రోహిత్-కోహ్లీ ద్వయం రికార్డులకెక్కింది.


ఇంగ్లండ్ టూర్‌లో వీరిద్దరూ కలిసి మరో 94 పరుగులు జోడిస్తే 5 వేల పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకుంటారు. అంతేకాదు, 133 పరుగులు కనుక చేస్తే రోహిత్ శర్మ-శిఖర్ ధావన్ జోడీ గతంలో నెలకొల్పిన 5,039 పరుగులు రికార్డు కూడా బద్దలవుతుంది. ఫలితంగా అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన టాప్-7 జోడీగా ఈ జంట రికార్డులకెక్కుతుంది. 


టీ20ల్లో రోహిత్-విరాట్ కలిసి ఇప్పటివరకు 991 పరుగులు చేశారు. మరో 9 పరుగులు చేస్తే ఈ ఫార్మాట్‌లో వెయ్యి పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకుంటారు. టెస్టుల్లో వీరిద్దరూ కలిసి 940 పరుగులు చేశారు. ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్టులో మరో 60 పరుగులు జోడిస్తే వెయ్యి పరుగుల మార్కును చేరుకుంటారు. ఈ సిరీస్‌ను కనుక కోహ్లీ-రోహిత్ జోడీ సద్వినియోగం చేసుకుని పరుగులు పిండుకుంటే మూడు ఫార్మాట్లలోనూ వెయ్యికి పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన మొట్టమొదటి భారత జోడీగా రోహిత్-కోహ్లీ రికార్డులకెక్కుతారు. 

Updated Date - 2022-06-22T01:24:27+05:30 IST