రోహిణి సింధూరిపై ఎంతకు పరువు నష్టం దావా వేశారో తెలిస్తే..

ABN , First Publish Date - 2021-06-24T18:45:21+05:30 IST

మైసూరు జిల్లాధికారిగా వ్యవహరించిన రోహిణి సింధూరిపై అదే జిల్లాకు చెందిన జేడీఎస్‌ పార్టీ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సా రా మహేశ్‌ రూ.100లకు పరువునష్టం వేశారు. మైసూరు అధికారిగా రోహిణి

రోహిణి సింధూరిపై ఎంతకు పరువు నష్టం దావా వేశారో తెలిస్తే..


బెంగళూరు: మైసూరు జిల్లాధికారిగా వ్యవహరించిన రోహిణి సింధూరిపై అదే జిల్లాకు చెందిన జేడీఎస్‌ పార్టీ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సా రా మహేశ్‌ రూ.100లకు పరువునష్టం వేశారు. మైసూరు అధికారిగా  రోహిణి సింధూరి పని చేసిన ఏడెనిమిది నెలల పాటు ఇరువురి మధ్య పలు అంశాలపై వివాదాలు కొనసాగాయి. ప్రస్తుతం కోర్టుల దాకా చేరినట్లు అయ్యింది. చామరాజనగర్‌ జిల్లా ఆసుపత్రిలో కొవిడ్‌ బాధితులు ఆక్సిజన్‌ అందక 20మంది మృతి చెందేందుకు రోహిణి సింధూరి కారకులని సా రా మహేశ్‌ అప్పట్లో ఆరోపించారు. చామరాజనగర్‌కు మైసూరు నుంచే ఆక్సిజన్‌ చేరవేయాల్సి ఉండగా జాప్యం చేశారని ఆయన ఆరోపించారు. వివాదంపై హైకోర్టు నియమించిన ఇరువురు రిటైర్డ్‌ న్యాయమూర్తుల విచారణలలో మైసూరు జిల్లాధికారి రోహిణి సింధూరికి సంబంధం లేదని తేల్చారు. ఇందుకు జిల్లా ప్రజలకు అధికా రులకు సా రా మహేష్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆ తర్వాత సారామహేష్‌కు చెందిన కళ్యాణమంటపం రాజకాలువపై ఉందని జిల్లాధికారి ఆరోపించారు. రెవెన్యూశాఖ పరిశీలనలలో అక్రమాలు చోటు చేసుకోలేదని తేలింది. దీనికి తోడు పదేళ్ళుగా సా రా మహేశ్‌తో పాటు ఆయన భార్యకు చెందిన ఆస్తులను విచారించాలని రోహిణి సింధూరి మైసూరు అభివృద్ధి ప్రాధికారకు లేఖ రాశారు. 


Updated Date - 2021-06-24T18:45:21+05:30 IST