ముంబై: టీమిండియా కెప్టెన్, ఐకానిక్ క్రికెటర్ rohit sharma శనివారం 35వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఏప్రిల్ 30, 1987న నాగ్‌పూర్‌లో జన్మించిన రోహిత్ తన క్రికెట్ కెరీర్లో అత్యంత కీలకమైన దశలోకి ప్రవేశించాడు. మున్ముందు రోహిత్ ప్రదర్శనపై అతడి వయసు ప్రభావం చూపేందుకు అవకాశాలు లేకపోలేదు. వయసు సంగతి అటుంచితే తనదైన రోజున ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించగలిగే సత్తావున్న రోహిత్ శర్మకు పలువురు క్రికెటర్ల నుంచి birthday wishes వెల్లువెత్తాయి. సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేశారు. ఈ జాబితాలో sachin tendulkar, yuvraj singh, virat kohliతోపాటు పలువురు క్రికెటర్లు ఉన్నారు. ‘హ్యాపీ బర్త్‌డే రోహిత్. నువ్వు ఈ ఏడాది చాలా గొప్ప ప్రదర్శన చేయాలని కోరుకుంటున్నా’ అని సచిన్ ట్వీట్ చేశాడు. యువరాజ్ సింగ్ స్పందిస్తూ.. ‘ సోదరా పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు తిరిగి పుంజుకోవాల్సిన సమయం ఇది. ఎప్పటిలాగానే బంతులను బౌండరీ దాటించాలి. ప్రత్యేకమైన ఈ రోజున నీకు శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశాడు. దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్టు టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఆకాంక్షించాడు. బర్త్‌డే శుభాకాంక్షలు చెప్పిన bcci రోహిత్ శర్మకి సాధించిన పలు విశేషాలను గుర్తుచేసింది.
బర్త్‌డే సందర్భంగా రోహిత్ శర్మ ప్రత్యేక రికార్డులివే..
1. అంతర్జాతీయ మ్యాచ్‌లు 400.
2. సాధించిన పరులుగు 15,733. కెరియర్ ఇంకా కొనసాగుతూనే ఉంది.
3. వన్డేల్లో 3 డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్.
4. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 4 సెంచరీలు కొట్టిన ఏకైక ఆటగాడు.
5. 2007- ఐసీసీ వరల్డ్ టీ20, 2013- ఐసీసీ చాంపియన్స్ ట్రోపీ గెలిచిన భారత జట్టులో సభ్యుడు.
6. టీమిండియా కెప్టెన్‌గా తొలి టెస్ట్ సిరీస్ విజయం.
7. తొలి డబుల్ సెంచరీ కొట్టినప్పుడు ఒకే ఇన్నింగ్స్‌లో ఏకంగా 16 సిక్సర్లు బాదాడు.
8. రోహిత్ శర్మ పేరిట ఉన్న 264 పరుగులే వన్డేల్లో ఇప్పటివరకు అత్యధిక స్కోరు.
9. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్.. ముంబై ఇండియన్స్ చేతికి 5 టైటిల్స్.